ట్యూబ్‌ల్లో ఆయుధాల రవాణా….

by Shyam |

<p>దిశ,వెబ్ డెస్క్: పాక్ నుంచి భారత్‌లోకి ఆయుధాలను రవాణా చేస్తున్న వ్యక్తులను ఇండియన్ ఆర్మీ శనివారం పట్టుకుంది. కెరన్ సెక్టార్ లోని కిషన్ గంగా నదిలో రబ్బర్ ట్యూబ్‌ల్లో ఆయుధాలను పెట్టి చేరవేసేందుకు వారు సిద్దమయ్యారు. కాగా వారిని ఇండియన్ ఆర్మీ గుర్తించింది. వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తులను ఆర్మీ అదుపులోకి తీసుకుంది. వారి దగ్గరి నుంచి నాలుగు ఏకే 47, మ్యాగజైన్లు, బుల్లెట్లను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. కాగా ఇండియాలోకి ప్రవేశించేందుకు పాక్ సరిహద్దుల వెంబడి [&hellip;]</p>

ట్యూబ్‌ల్లో ఆయుధాల రవాణా….
X

దిశ,వెబ్ డెస్క్:
పాక్ నుంచి భారత్‌లోకి ఆయుధాలను రవాణా చేస్తున్న వ్యక్తులను ఇండియన్ ఆర్మీ శనివారం పట్టుకుంది. కెరన్ సెక్టార్ లోని కిషన్ గంగా నదిలో రబ్బర్ ట్యూబ్‌ల్లో ఆయుధాలను పెట్టి చేరవేసేందుకు వారు సిద్దమయ్యారు. కాగా వారిని ఇండియన్ ఆర్మీ గుర్తించింది. వెంటనే అప్రమత్తమై ఆ వ్యక్తులను ఆర్మీ అదుపులోకి తీసుకుంది. వారి దగ్గరి నుంచి నాలుగు ఏకే 47, మ్యాగజైన్లు, బుల్లెట్లను ఆర్మీ స్వాధీనం చేసుకుంది. కాగా ఇండియాలోకి ప్రవేశించేందుకు పాక్ సరిహద్దుల వెంబడి 300మందికి పైగా ఉగ్రవాదులు ల్యాంచ్ ప్యాడ్ల వద్ద ఉన్నారని ఆర్మీ అధికారులు చెబుతున్నారు. ఆర్మీ అప్రమత్తంగా ఉండటంతో ఉగ్రవాదులు ఇండియాలోకి ప్రవేశించలేక పోతున్నారని అధికారులు తెలిపారు.

Next Story