మీ బైక్ బయటకు తీస్తున్నారా.. అయితే జాగ్రత్త.. అది లేకుంటే సీజ్…

by  |
మీ బైక్ బయటకు తీస్తున్నారా.. అయితే జాగ్రత్త.. అది లేకుంటే సీజ్…
X

దిశ,బోథ్ : మాస్కు, హెల్మెట్ లేకుండా బయట తిరిగే ద్విచక్ర వాహన దారులను పోలీసులు సీసీ కెమెరాలు, ఫోన్‌ల ద్వారా ఫొటోలు తీస్తూ జరిమానాకు సంబంధించిన సమాచారాన్ని వారి వారి ఫోన్ కు సమాచారం అందిస్తుంటారు. అయితే పోలీసుల కళ్ళు కప్పి తప్పించుకోవటానికి కొందరు వాహనాదారులు ద్విచక్ర వాహనాలకు ముందు వెనక భాగంలో నెంబర్ ప్లేటు లను సగం వంచడం, కొన్ని నెంబర్లు తొలగించడం లాంటివి చేసి పోలీసులకు చిక్కకుండా తప్పించుకుంటున్నారు. ఇచ్చోడ మండల కేంద్రానికి చుట్టూ ప్రక్కల గల నాలుగైదు మండలాల ప్రజలు నిత్యావసర వస్తువుల విక్రయాల కోసం వస్తుంటారు. నెంబర్ ప్లేట్ సరిగా లేని వాహనాలను సీజ్ చేసి జరిమానాలు విధిస్తున్నారు.

కానీ ఇచ్చోడ మండల పొలీసులు బుధవారం ప్రత్యేక చొరవ తీసుకొని సీ.ఐ విద్యాసాగర్, ఎస్.ఐ విజయ్, ఏ.ఎస్.ఐ లింబాజి 20 వాహనాలను పట్టుకున్నారు. అంతేకాకుండా ప్రతి వాహనదారులు నెంబర్ ప్లేట్ లు సక్రమంగా ఉంచుకోవాలని, సరైన ధృవ పత్రాలు వాహన దారుడి వద్ద ఉండాలని సూచించారు. ఈ సందర్భంగా ఇచ్చోడ సీ.ఐ కంప రవీందర్ మాట్లాడుతూ ద్విచక్ర వాహనాల కు ముందు వెనక సరైన నెంబర్ ప్లేట్ నిబంధనల ప్రకారం ఉండాలని, అలా లేని వాటిని సీజ్ చేస్తామని హెచ్చరించారు. అదేవిధంగా చిన్న పిల్లలకు వాహనాలు ఇవ్వద్దని, ప్రమాదాలకు లోను కాకుండా వారి తల్లిదండ్రులు జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. ఒక వేళ ఎవరైనా చిన్న పిల్లలకు వాహనాలు ఇస్తే వారి తల్లిదండ్రుల పై చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని వెల్లడించారు.


Next Story

Most Viewed