ఏఆర్ రెహమాన్‌కు మాతృ వియోగం

by Shyam |

<p>దిశ, వెబ్‌డెస్క్: సంగీత దర్శకులు ఏఆర్ రహమాన్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కరీమా బేగం కన్ను మూశారు. ట్విట్టర్ పేజ్‌లో అమ్మ ఫొటో షేర్ చేసిన రహమాన్ నివాళులు అర్పించారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు. కాగా రహమాన్‌కు తల్లితో తనకున్న అనుబంధాన్ని చాలా సార్లు వివరించారు. పలు స్టేజ్‌ షోస్‌లోనూ తల్లిని తలుచుకుంటూ ఉండే ఆయన.. తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ [&hellip;]</p>

ఏఆర్ రెహమాన్‌కు మాతృ వియోగం
X

దిశ, వెబ్‌డెస్క్: సంగీత దర్శకులు ఏఆర్ రహమాన్‌కు మాతృవియోగం కలిగింది. ఆయన తల్లి కరీమా బేగం కన్ను మూశారు. ట్విట్టర్ పేజ్‌లో అమ్మ ఫొటో షేర్ చేసిన రహమాన్ నివాళులు అర్పించారు. దీంతో పలువురు సెలబ్రిటీలు, అభిమానులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. తన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకున్నారు.

కాగా రహమాన్‌కు తల్లితో తనకున్న అనుబంధాన్ని చాలా సార్లు వివరించారు. పలు స్టేజ్‌ షోస్‌లోనూ తల్లిని తలుచుకుంటూ ఉండే ఆయన.. తొమ్మిదేళ్ల వయసులోనే తండ్రి మరణించడంతో కుటుంబ బాధ్యతలు ఎలా మోశారు.. తనతో పాటు ముగ్గురు ఆడపిల్లల బాధ్యతను ఎలా తీసుకున్నారు అనే విషయాలను చెప్పారు. అమ్మ ఆలోచించే విధానం.. నిర్ణయం తీసుకునే విధానం చాలా గొప్పగా ఉంటుందని చెప్పే రహమాన్.. తను సంగీతాన్ని ఎంచుకునేందుకు కారణం కూడా తనే అని ఓ ఇంటర్వ్యూలో తెలిపారు. పదకొండో తరగతిలో పాఠశాల వదిలేసి.. సంగీత ప్రపంచంలో అడుగుపెట్టేలా చేసింది అమ్మే అని చెప్పారు. ఆస్కార్ విన్నింగ్ మ్యుజిషియన్‌గా ఎదిగానంటే.. అందుకు అమ్మ సహకారమే కారణమన్నారు.

Next Story