బాలీవుడ్‌పై ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు

by  |
బాలీవుడ్‌పై ఏఆర్ రెహమాన్ సంచలన వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: యువ హీరో సుశాంత్ సింగ్ రాజ్ పుత్ ఆత్మహత్య అనంతరం బాలీవుడ్‌లో జరిగే దారుణాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ప్రముఖ సంగీత దర్శకుడు.. ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ పై సంచలన వ్యాఖ్యలు చేశారు. సుశాంత్ చివరి సినిమా ‘దిల్ బేచారా’ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా సంగీత దర్శకుడిగా రెహమాన్ ప్రమోషన్ లో భాగంగా పలు విషయాలు వెల్లడించారు. తనకు ఆఫర్లు రాకుండా కొంతమంది కుట్ర చేస్తున్నారని ఆయన ఆరోపించారు.

బాలీవుడ్ నుంచి నన్ను తప్పించేందుకు తెరవెనుక ప్రయత్నాలు జరుగుతున్నాయి. చాలా సినిమాలు నా వరకు రాకుండా మధ్యలోనే అడ్డుకుంటూ నన్ను బాలీవుడ్ కు దూరం చేసేందుకు కొందరూ కంకణం కట్టుకున్నారని సంచలన ఆరోపణలు చేశారు. దిల్ బేచారా దర్శకుడు ముఖేష్ చబ్రా మాట్లాడుతూ..సమయానికి సినిమా విడుదల అవ్వాలంటే రెహమాన్ తో కాకుండా మరో సంగీత దర్శకుడితో పనిచేస్తే మంచిదని పలువురు సూచించారని అన్నారు.

Next Story

Most Viewed