ఏప్రిల్ 1.. ఆల్ పూల్స్ డే ఎందుకు అయ్యిందో తెలుసా?

by  |
ఏప్రిల్ 1.. ఆల్ పూల్స్ డే ఎందుకు అయ్యిందో తెలుసా?
X

దిశ, వెబ్ డెస్క్: ఏప్రిల్ 1 .. ఆల్ పూల్స్ డే. ఒకరినొకరు ఆటపట్టించుకుంటూ బకరాలను చేసుకొనే రోజు. ప్రపంచవ్యాప్తంగా ఈ రోజున అందరు నవ్వుతూ, నవ్విస్తూ తెలిసిన వారిని, తెలియని వారిని సైతం బకరాలను చేస్తుంటారు. అసలు ఈరోజుకు ఉన్న ప్రత్యేకత ఏంటి? ఈరోజే ఈ పూల్స్ డే ను ఎందుకు జరుపుకుంటారు? అనేది ఇప్పటీకీ ఎవరికి తెలియని ఒక మిస్టరీ. అయితే కొన్ని సంవత్సరాల నుండి చరిత్రకారులు తెలిపిన కథనాల ప్రకారం.. ఫ్రాన్స్‌లో జూలియన్ క్యాలెండర్ స్థానంలో గ్రెగోరియన్ క్యాలెండర్ ప్రవేశపెట్టిన తరువాత ఏప్రిల్ పూల్స్ డే ను జరుపుకోవడం ప్రారంభమైంది. ఐతే కొత్త క్యాలెండర్ జనవరి 1 నుండి 1952 లో ప్రారంభమవుతుందని తీర్పు ఇచ్చింది. ఆ తర్వాత కొన్ని దేశాలు కొత్త క్యాలెండర్ వచ్చిన రోజును నూతన సంవత్సరంగా జరుపుకుంటున్నారు.

మరికొన్ని దేశ ప్రజలు కొత్త క్యాలెండర్ ను అంగీకరించకుండా జూలియన్ క్యాలెండర్ నే అనుకరిస్తుండేవారు. అలా చేసినవారిని తెలివి తక్కువ వాళ్ళకింద భావించి వారిపై జోకులు వేసేవాళ్ళు. అలా ఏప్రిల్ పూల్ డే వచ్చిందని చరిత్రకారుల అభిప్రాయం. ఇక ఈరోజున స్నేహితులను, బంధువులను ఆట పట్టిస్తూ బకరాలను చేసి నవ్వుకుంటారు. ప్రస్తుతం కొన్ని దేశాల్లో ఏప్రిల్ పూల్ డే ఒక సాంప్రదాయంగా మారిపోయింది.

Next Story

Most Viewed