‘యాపిల్ ఫర్ కిడ్స్’-సొల్యుషన్స్ టు పేరేంట్స్

by  |
Apple
X

దిశ, ఫీచర్స్: ప్రజెంట్ టెక్ ఎరాలో చిల్డ్రన్స్ వద్ద ఐఫోన్, ఐప్యాడ్ లేదా ఆపిల్ వాచ్ ఉండటం సహజం. అయితే చిన్నారులకు మొబైల్ ఇవ్వడంతోనే పేరేంట్స్ బాధ్యత తీరిపోదు. మొబైల్‌లో పిల్లలు ఏం చూస్తున్నారు, ఎలాంటి కంటెంట్ వెతుకుతున్నారు అనే విషయాన్ని కూడా మానిటర్ చేయాలి. అంతేకాదు ఇంటర్నెట్ ఓపెన్ చేస్తే..పిల్లల్ని తప్పుదోవ పట్టించే ఎన్నో వెబ్‌సైట్స్, వీడియోలు ఉంటాయి. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ సమస్యలకు చెక్ పెట్టడంతో పాటు మొబైల్ వాడకంపై పరిమితులు విధించడంపై తల్లిదండ్రులు, సంరక్షకులకు సహాయపడటానికి ‘యాపిల్’ సంస్థ పిల్లల కోసం ప్రత్యేక వెబ్‌సైట్ ప్రారంభించింది.

కొవిడ్ తర్వాత చాలామంది పిల్లలు ఆన్‌లైన్ లెస్సన్స్ నేర్చుకోవడం కామన్‌గా మారిపోయింది. ఈ నేపథ్యంలో పిల్లలకు తగిన గైడ్‌లైన్స్, టిప్స్ అందించడానికి యాపిల్ ‘యాపిల్ ఫర్ కిడ్స్’ అనే వెబ్‌సైట్ తీసుకొచ్చింది. ఇందులో భాగంగా ముందుగా ‘ఫ్యామిలీ షేరింగ్’ ఫీచర్ సెటప్ చేసుకోవాలి. ఇందుకుగానూ ప్రతి వ్యక్తికి వారి సొంత యాపిల్ ఐడీ అవసరం. ఫ్యామిలీ ఆర్గనైజర్, తమ పిల్లల కోసం యాపిల్ ఐడీలను క్రియేట్ చేయాలి. ఆ తర్వాత చైల్డ్స్ డివైజ్ సెటప్ చేయాలి. చిన్నారులు యాపిల్ ఐడీతో ఆపిల్ పరికరాలకు సైన్ ఇన్ అవ్వడానికి, పాస్‌కోడ్‌ను క్రియేట్ చేయాలి. ‘యాపిల్ ఫర్ కిడ్స్’ పేజీలో ఐఫోన్ లేని కుటుంబ సభ్యుల కోసం ఆపిల్ వాచ్‌ను ఎలా సెటప్ చేయాలో కూడా యాపిల్ వివరిస్తుంది. పిల్లల కార్యకలాపాలను ఎలా ట్రాక్ చేయాలో పరిమితులను నిర్ణయించడం ఎలానో, వినియోగాన్ని పర్యవేక్షించడం వంటి విషయాలకు సంబంధించిన ఆరు టిప్స్ యాపిల్ ఫర్ కిడ్స్ పేరేంట్స్‌కు అందిస్తోంది.

అప్రూవ్ పర్చేసెస్ విత్ ఆస్క్ టు బై
పిల్లలు ఆన్‌లైన్‌లో ఏవైనా వస్తువులు కొనుగోలు చేయాలంటే ముందు కుటుంబ సభ్యుల అనుమతి తప్పనిసరి.

లోకేట్ మిస్సింగ్ డివైజ్ విత్ ఫైండ్ మై
ఐఫోన్ డివైజ్‌లో ‘ఫైండ్ మై’ ఆన్ చేయాలి. దీని వల్ల ఒకవేళ పిల్లలు తమ ఐఫోన్‌‌ను పొగొట్టుకున్నా, ఎక్కడైనా పడేసినా అదెక్కడ ఉందో తెలుసుకోవడానికి మ్యాప్‌లో చూడొచ్చు. ఒకవేళ ఇంటి పరిసర ప్రాంతాల్లోనే ఉంటే..సౌండ్ ప్లే చేసి కనుగొనవచ్చు.

యూజ్ యాపిల్ క్యాష్ ఫ్యామిలీ
పిల్లలకు యాపిల్ పేలో క్యాష్ పంపిస్తే, ఖర్చు చేయాలనుకున్నా పేరేంట్స్ అనుమతి కావాలి. తద్వారా ఖర్చు నియంత్రణలో ఉండటంతో పాటు, ఎందుకోసం ఖర్చు చేస్తున్నారో కూడా తెలుస్తోంది.

ప్రివెంట్ ఇన్ యాప్ పర్చేస్
యాప్ స్టోర్స్ నుంచి అన్ ఆథరైజ్డ్ లేదా అన్ ఇంటెన్షనల్ పర్చేజెస్ చేయకుండా జాగ్రత్త పడొచ్చు.

సెట్ లిమిట్స్ విత్ స్క్రీన్ టైమ్
పిల్లలు డివైజెస్‌ను ఎలా ఉపయోగిస్తున్నారో గమనించొచ్చు. యాప్స్ లేదా యాప్స్ కేటగిరీస్ కోసం సమయ పరిమితులను సెట్ చేయొచ్చు. అంతేకాదు వారు కమ్యూనికేషన్ కూడా కంట్రోల్ చేయొచ్చు.

పేరెంటల్ కంట్రోల్స్ ఆన్ యువర్ చైల్డ్స్ డివైజ్
మొబైల్స్‌లో పిల్లలు చూసే ప్రతి విషయం పేరెంట్స్ నియంత్రణలో ఉంటుంది. పిల్లలు ఏ యాప్స్ ఉపయోగించవచ్చో, వారు ఏ కంటెంట్‌ను యాక్సెస్ చేయగలరో, సెట్టింగ్స్ మార్చకుండా కూడా నియంత్రించొచ్చు. స్క్రీన్ సమయాన్ని కూడా సెటప్ చేయొచ్చు.


Next Story

Most Viewed