భారత్‌లో పెగట్రాన్ తయారీ పరిశ్రమ ఏర్పాటు

by  |
భారత్‌లో పెగట్రాన్ తయారీ పరిశ్రమ ఏర్పాటు
X

దిశ, వెబ్‌డెస్క్: అమెరికాకు చెందిన ప్రముఖ మొబైల్ దిగ్గజ కంపెనీ యాపిల్ ఇంక్ భాగస్వామి పెగట్రాన్ భారత్‌లో తన మొదటి ప్లాంట్ కోసం సన్నాహాలు చేస్తోంది. దేశంలో భారీగా పెట్టుబడులను పెట్టేందుకు పెగట్రాన్ ప్రయత్నాలు మొదలుపెట్టింది. చెన్నైలో పెగట్రాన్ తయారీ పరిశ్రమను స్థాపించబోతున్నట్టు కంపెనీ వర్గాలు వెల్లడించాయి. పెగట్రాన్ కార్యాలయాలు, ఉద్యోగులు ఎక్కువగా చైనాలో ఉండగా, తాజా పరిణామాల నేపథ్యంలో దేశంలో ఈ పెట్టుబడులు రావడం సంతోషకరమని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు.

కాగా, యాపిల్‌ ఐఫోన్‌ను తయారు చేసే ప్రపంచ ప్రఖ్యాత తయారీ కంపెనీలు విస్ట్రాన్‌, ఫోక్సన్‌లు ఇప్పటికే దేశంలో తయారీని ప్రారంభించిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ వర్గాలు సైతం చైనాను కాదని భారత్‌లో పెట్టుబడులకు రావడం సంతోషకరమని వెల్లడించాయి. కాగా, గతేడాది యాపిల్ ఇంక్ భారత్‌లో రూ. 150 కోట్ల టర్నోవర్‌ను సాధించింది. ఇక, పెగట్రాన్ సీఈవో లియా షీ మార్చిలో చేసిన ఓ ప్రకటనలో భారత్‌లో పెట్టుబడులను పెట్టాలనే అంశాన్ని పరిశీలిస్తున్నామని, క్లయింట్ల సూచనలు, ప్రభుత్వ విధివిధానాల అనుగుణంగా ఈ అంశాన్ని పరిశీలిస్తామని చెప్పారు. చైనాలో అనేక కర్మాగారాలతో పెగట్రాన్ రెండో అతిపెద్ద కంపెనీగా ఉంది. ఈ సంస్థ వ్యాపారంలో సగానికిపైగా ఆపిల్ ఉత్పత్తులను నిర్వహించేది. పెగట్రాన్ భారత్‌లో ప్రవేశించడం బడ్జెట్ ఐఫోన్ తయారీలో తమ వాటాను విస్తరించడానికి రక్షణాత్మక చర్యగా నిపుణులు అంచనా వేస్తున్నారు.



Next Story

Most Viewed