- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బందరు మహిళ.. నార్కట్‌పల్లిలో శవమైంది
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: గతనెలలో బందరులో అదృశ్యమైన మహిళ శనివారం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద శవమై కనిపించడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నానికి చెందిన పల్లపోతు పద్మజ(45) సర్కిల్పేటలో నివాసం ఉంటూ ఓ రెస్టారెంటులో పనిచేస్తోంది. ఆగస్టు 31న విధులకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఇనగుదురుపేట పోలీసు స్టేషన్లో బంధువులు ఫిర్యాదు చేశారు. ఇదేక్రమంలో శనివారం నార్కట్‌పల్లి వద్ద ఓ మహిళ మృత దేహం కాలిపోయి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: గతనెలలో బందరులో అదృశ్యమైన మహిళ శనివారం నల్గొండ జిల్లా నార్కట్‌పల్లి వద్ద శవమై కనిపించడం కలకలం రేపింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మచిలీపట్నానికి చెందిన పల్లపోతు పద్మజ(45) సర్కిల్పేటలో నివాసం ఉంటూ ఓ రెస్టారెంటులో పనిచేస్తోంది. ఆగస్టు 31న విధులకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఇనగుదురుపేట పోలీసు స్టేషన్లో బంధువులు ఫిర్యాదు చేశారు. ఇదేక్రమంలో శనివారం నార్కట్‌పల్లి వద్ద ఓ మహిళ మృత దేహం కాలిపోయి ఉండడాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. ప్రాథమిక దర్యాప్తులో మృతదేహం పద్మజ అనే మహిళదిగా గుర్తించి ఇనగుదురు పోలీసులకు సమాచారమిచ్చారు. పోలీసులతోపాటు బంధువులు నార్కట్‌పల్లి చేరుకొని మృతదేహాన్ని మచిలీపట్నం తరలించారు. పద్మజను హత్య చేసిన వారిని గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని బంధువులు డిమాండు చేస్తున్నారు.
Next Story






