- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఎన్నికల నిర్వహణ అనేది రాజ్యాంగ విధి: ఎస్ఈసీ
<p>దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికల నిర్వహణ అనేది రాజ్యాంగ విధి అని ఏపీ ఎస్ఈసీ తెలిపింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ ప్రకటన జారీ చేసింది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల అభ్యంతరాలపై ఎస్ఈసీ స్పందించింది. పోలింగ్ సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ఫేస్‌షీల్డ్‌లు, మాస్క్‌లు,శానిటైజర్లు పంపిణీ చేస్తామని వెల్లడించింది. ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరింది. నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయని పేర్కొంది. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటి లేరని […]</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఎన్నికల నిర్వహణ అనేది రాజ్యాంగ విధి అని ఏపీ ఎస్ఈసీ తెలిపింది. పంచాయతీ ఎన్నికల నిర్వహణపై ఎస్ఈసీ ప్రకటన జారీ చేసింది. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల అభ్యంతరాలపై ఎస్ఈసీ స్పందించింది. పోలింగ్ సిబ్బంది భద్రతకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పింది. ఫేస్‌షీల్డ్‌లు, మాస్క్‌లు,శానిటైజర్లు పంపిణీ చేస్తామని వెల్లడించింది.
ఎన్నికల నిర్వహణకు అందరూ సహకరించాలని కోరింది. నిర్ణీత సమయంలో ఎన్నికలు నిర్వహిస్తేనే ఆర్థిక సంఘం నుంచి నిధులు వస్తాయని పేర్కొంది. ఏపీ ఉద్యోగులకు ఎవరూ సాటి లేరని కొనియాడింది. సమర్థవంతంగా ఎన్నికలు నిర్వహిస్తామనే విశ్వాసాన్ని వ్యక్తం చేసింది. పోలింగ్ సిబ్బంది కరోనా బారిన పడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపింది. వ్యాక్సినేషన్‌లో పోలింగ్ సిబ్బందికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరినట్టు చెప్పింది.
Next Story






