శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలపై స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు

116
ap assembly speaker tammineni sitaram

దిశ, వెబ్‌డెస్క్: శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థలపై ఏపీ స్పీకర్ తమ్మినేని సంచలన వ్యాఖ్యలు చేశారు. శ్రీచైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో పనిచేస్తున్న టీచర్లకు సవాల్ విసిరారు. కింతలిలోని జెడ్పీహెచ్ స్కూల్లోని టీచర్లతో పోటీకి రావాలంటూ ఛాలెంజ్ చేశారు. ‘శ్రీచైతన్య, నారాయణ అంటూ తల్లిదండ్రులు ఎందుకు పరుగులు తీస్తున్నారు. ఆ సంస్థల్లో పనిచేస్తున్న వారికెవరికీ పూర్తిస్థాయి క్వాలిఫికేషన్ లేదు. అక్కడంతా ఏబీసీడీఎఫ్ అని బట్టీ పట్టించడమే తెలుసు. పిల్లల మెదడును మానుప్లేట్ చేస్తారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉపాధ్యాయులు మంచి ట్రైనింగ్ కలిగినవారు’ అని తమ్మినేని వ్యాఖ్యానించారు.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..