డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించిన ఏపీ ఎస్ఈసీ

28

దిశ, వెబ్‌డెస్క్: పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను సస్పెండ్ చేస్తూ ఏపీ హైకోర్టు ఇచ్చిన తీర్పుపై సోమవారం ఎస్ఈసీ డివిజన్‌ బెంచ్‌ను ఆశ్రయించింది. సింగిల్ జడ్జి ఆదేశాలను డివిజన్ బెంచ్‌లో ఎస్ఈసీ సవాల్ చేస్తూ అత్యవసర పిటిషన్‌గా భావించి విచారించాలని కోరింది. ఈ పిటిషన్‌‌పై రేపు విచారణకు వచ్చే అవకాశం ఉంది. నాలుగు రోజుల క్రితం పంచాయతీ ఎన్నికల షెడ్యూల్‌ను విడుదల చేస్తూ ఏపీ ఎస్ఈసీ నిమ్మగడ్డ రమేశ్ కుమార్ ప్రకటన చేయగా.. ఎస్ఈసీ ప్రకటనను సవాల్ చేస్తూ శనివారం ఏపీ ప్రభుత్వం హైకోర్టులో హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారించిన న్యాయస్థానం ఇవాళ ఎస్ఈసీ షెడ్యూల్‌ను సస్పెండ్ చేసింది.