ఏపీలో భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు..

by  |
ఏపీలో భారీగా పెరుగుతున్న డెంగ్యూ కేసులు..
X

దిశ, ఏపీ బ్యూరో: రాష్ట్రంలో సీజనల్ వ్యాధులపై ప్రభుత్వం అప్రమత్తమైందని డిప్యూటీ సీఎం, వైద్యఆరోగ్యశాఖ మంత్రి ఆళ్ల నాని స్పష్టం చేశారు. సచివాలయంలో సోమవారం సీజనల్ వ్యాధులపై డిప్యూటీ సీఎం ఆళ్ల నాని సమీక్ష నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రంలో 1,575 డెంగ్యూ కేసులు నమోదైనట్లు చెప్పుకొచ్చారు. గుంటూరు జిల్లా లో 276 డెంగ్యూ కేసులు, 13 మలేరియా కేసులు కూడా నమోదైనట్లు తెలిపారు. డెంగ్యూ గాని మలేరియా గాని లక్షణాలు కనిపిస్తే వెంటనే వైద్య పరిక్షలు నిర్వహించేలా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.

గుంటూరు జిల్లాలో శానిటేషన్‌పై ప్రత్యేక డ్రైవ్ నిర్వహించాలని కలెక్టర్‌ను ఆదేశించినట్లు చెప్పుకొచ్చారు. డెంగ్యూ కేసులను ఆసరా చేసుకుని ప్రైవేట్ హాస్పిటల్స్‌పై దోపిడీకి పాల్పడుతున్నాయని ఆరోపణలు వస్తున్నాయన్నారు. సీజనల్ వ్యాధుల విజృంభిస్తున్న సమయంలో అధిక ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. శానిటేషన్‌తో పాటు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నామని అలాగే దోమల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు రూపొందిస్తున్నట్లు మంత్రి ఆళ్ల నాని తెలిపారు.

Next Story

Most Viewed