ఏపీలో కొత్తగా 7,293 కేసులు..

10

దిశ, వెబ్‌డెస్క్ :

ఏపీలో కరోనా కేసులు తగ్గినట్టే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. తాజాగా విడుదలైన హెల్త్ బులెటిన్ ప్రకారం… రాష్ట్రంలో కొత్తగా 7,293 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో ఇప్పటివరకు నమోదైన మొత్తం కేసుల సంఖ్య 6,68,751కు చేరుకుంది.

ఇందులో యాక్టివ్ కేసులు 65,794 ఉండగా.. 5,97,294 మంది కరోనా నుంచి కోలుకున్నారు. గడచిన 24 గంటల్లో 57 మంది కరోనాతో మృతిచెందగా, ఇప్పటివరకు ఏపీలో 5,663 కరోనా మరణాలు సంభవించాయి. గడచిన 24 గంటల్లో రాష్ట్రవ్యాప్తంగా 75,990 కరోనా టెస్టులు చేయగా, మొత్తం టెస్టుల సంఖ్య 55,23,786కు చేరింది.