- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గ్యాస్ లీకేజీ బాధితులకు 30 కోట్లు విడుదల
<p>దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు జీవీ జారీ అయింది. ముఖ్యమంత్రి వైజాగ్‌లో ప్రకటించిన ప్రకారం మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, వెంటిలేటర్‌పై ఉన్నవారికి 10 లక్షల రూపాయలు, రెండు లేదా మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిన వారికి లక్ష […]</p>

X
దిశ ఏపీ బ్యూరో: విశాఖపట్టణంలోని ఎల్జీ పాలిమర్స్ కంపెనీ గ్యాస్ లీకేజీ బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి 30 కోట్ల రూపాయలు విడుదల చేశారు. ముఖ్యమంత్రి సహాయనిధి (సీఎంఆర్‌ఎఫ్) నుంచి ఈ మొత్తాన్ని విడుదల చేస్తున్నట్టు జీవీ జారీ అయింది. ముఖ్యమంత్రి వైజాగ్‌లో ప్రకటించిన ప్రకారం మృతుల కుటుంబాలకు కోటి రూపాయలు, వెంటిలేటర్‌పై ఉన్నవారికి 10 లక్షల రూపాయలు, రెండు లేదా మూడు రోజులు ఆస్పత్రిలో ఉండాల్సి వచ్చిన వారికి లక్ష రూపాయలు, వెంకటాపురం గ్రామస్థులకు ఇంటికి 25 వేల రూపాయలు సాయం అందించాలని సూచించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే విశాఖ జిల్లా కలెక్టర్ పేరిట 30 కోట్లు విడుదల చేసినట్టు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి వి.ఉషారాణి తెలిపారు.
Next Story






