- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బడుగుల ఉపాధికి వాహనాలు
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఏపీ బ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పేదల ఇంటికే రేషన్ బియ్యం అందించేందుకు 9260 వాహనాలు కొనుగోలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి మండలి నిర్ణయం మేరకు స్వయం ఉపాధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ యువతకు ఈ వాహనాలు ఇస్తారు. వాహనాల కొనుగోలుకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకుల ద్వారా రుణం అందించనుంది. రుణం తిరిగి చెల్లించేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ […]</p>

X
దిశ, ఏపీ బ్యూరో: ప్రజా పంపిణీ వ్యవస్థలో భాగంగా పేదల ఇంటికే రేషన్ బియ్యం అందించేందుకు 9260 వాహనాలు కొనుగోలు చేయాలని సోమవారం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రి మండలి నిర్ణయం మేరకు స్వయం ఉపాధి పథకం కింద ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీ యువతకు ఈ వాహనాలు ఇస్తారు. వాహనాల కొనుగోలుకు 60 శాతం సబ్సిడీ, 30 శాతం బ్యాంకుల ద్వారా రుణం అందించనుంది.
రుణం తిరిగి చెల్లించేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ హామీ ఇచ్చింది. ఆరు సంవత్సరాలపాటు రుణం తీర్చిన అనంతరం లబ్దిదారుల పేరుతో వాహనం అందిస్తారు. వాహనాల సబ్సిడి కోసం రూ. 331 కోట్లు అప్పు తీసుకునేందుకు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ కు అనుమతి ఇచ్చారు. బియ్యం డోర్ డెలివరీ కి ప్రతి ఏడాది రూ. 776. 45 కోట్లు మంజూరు చేయనున్నారు.
Next Story






