జగన్ సర్కార్ మరో కీలక నిర్ణయం.. అది కూడా విశాఖకే

100

దిశ, వెబ్ డెస్క్: ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. విజయవాడలో కమాండ్ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. విశాఖలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విశాఖలో అందుబాటులో ఉన్న ప్రభుత్వ భూమిలో కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అలాగే విజయవాడ కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌కు కేటాయించిన రూ.13.80 కోట్లను విశాఖలో కమాండ్‌ కంట్రోల్‌ రూమ్‌ నిర్మాణానికి బదలాయించాలని ఉత్తర్వుల్లో పేర్కొంది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..