మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకి బిగ్ రిలీఫ్

by  |
మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యంకి బిగ్ రిలీఫ్
X

ఆంధ్రప్రదేశ్ మాజీ చీఫ్ సెక్రెటరీ ఎల్వీ సుబ్రహ్మణ్యానికి ప్రభుత్వం ఊరటనిచ్చింది. సీఎస్‌గా ఉన్న సమయంలో ప్రభుత్వ ఫైళ్లను తిప్పి పంపిస్తున్నారంటూ కినుక వహించిన ప్రభుత్వం ఆయనను ఊహించని విధంగా విధుల నుంచి తప్పించిన సంగతి తెలిసిందే. దీంతో ఆయనను కేంద్ర సర్వీసులకు పిలిచారంటూ వార్తలు కూడా వెలువడ్డాయి. ఆయన నేడు పదవీ వివరమణ (రిటైర్మెంట్) చేయాల్సి ఉంది.

అధికారిక విధుల్లో లేని నేపథ్యంలో నేడు రిటైర్ అయితే ఆయనకు రావాల్సిన రిటైర్మింట్ బెనిఫిట్స్ కోల్పోయే ప్రమాదం ఉంది. ఈ నేపథ్యంలో ఆయన వాటిని కోల్పోని విధంగా రాష్ట్ర ప్రభుత్వం కీలక వెసులుబాటు కల్పించింది. ఆయనను బాపట్లలోని మానవ వనరుల అభివృద్ధి శిక్షణా సంస్థ డైరెక్టర్‌గా నియమించింది. అయితే లాక్‌డౌన్ నిబంధనల నేపథ్యంలో హైదరాబాదులో ఉన్న ఆయన విధుల్లో చేరే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఆన్‌లైన్ మాధ్యమంగా హైదరాబాద్ నుంచి బాధ్యతలు స్వీకరించి, ఆపై పదవీ విరమణ చేసే వెసులుబాటును కల్పించింది.

ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. కాగా, గత సంవత్సరం నవంబర్‌లో సీఎస్ పదవి నుంచి ఎల్వీని జగన్ ప్రభుత్వం తప్పించి, మానవ వనరుల అభివృద్ధి కేంద్రం డీజీగా నియమించింది. దీంతో అసంతృప్తికి గురైన ఆయన, బాధ్యతలు స్వీకరించకుండా, ఉద్యోగానికి సుదీర్ఘ సెలవు (లాంగ్ లీవ్) పెట్టారు. రిటైర్మెంట్ సమయం ముంచుకొస్తున్నందున, సర్వీస్ కాలం తక్కువగా ఉండడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని వార్తలు వచ్చాయి. నేడు ఆయన ఆన్‌లైన్ మాధ్యమంగా విధుల్లో జాయినై రిటైర్ కానున్నారు.

tags: lv subrahmanyam, ex-cs, ap, government, relief


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed