పలు కోర్సులకు ఫీజుల ఖరారు

55

దిశ,వెబ్ డెస్క్: ప్రైవేట్, అన్ ఎయిడెడ్ కాలేజీల్లో డిప్లమా కోర్సుల ఫీజులను ఏపీ ప్రభుత్వం ఖరారు చేసింది. బీఎస్సీ, ఎమ్మెస్సీ నర్సింగ్, బీపీటీ, పారా మెడికల్ డిప్లమా ఫీజులను నిర్ధారిస్తూ ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులను జారీ చేసింది. బీఎస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా ఫీజు రూ.18వేలు, మేనేజ్ మెంట్ రూ.80వేలు, ఎమ్మెస్సీ నర్సింగ్ కన్వీనర్ కోటా రూ. 83వేలు, మేనేజ్ మెంట్ కోటా రూ.1లక్షా 49వేలు, బీపీటీ కోర్సుకు కన్వీనర్ కోటా రూ.18వేలు, మేనెజ్ మెంట్ కోటా రూ.80వేలుగా ప్రభుత్వం నిర్ణయించింది.

గల్లీ టూ గ్లోబల్ అప్డేట్స్.. రంగులు మారే రాజకీయాలపై ఆసక్తికర విశ్లేషణలు.. దమ్మున్న వార్తలు.. ఎప్పటికప్పుడు.. వాట్సాప్ ద్వారా పొందాలంటే.. మా నెంబ‌ర్‌ +91 88864 24242 ను సేవ్ చేసుకొని, "START" అని వాట్సాప్ ద్వారా మెసేజ్ పంపండి..