- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఏపీ డిప్యూటీ సీఎంకు తప్పిన ప్రమాదం..
<p>దిశ, కోదాడ: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బైపాస్‌రోడ్‌పై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు నారాయణ స్వామి కాన్వాయ్ వెళుతోంది. ఈ క్రమంలో కోదాడ పట్టణ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ముందు వెళుతున్న ఎస్కార్ట్ వాహనం సడన్‌గా బ్రేక్ వేసింది. దీంతో వెనుక […]</p>

దిశ, కోదాడ: ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామికి పెను ప్రమాదం తప్పింది. ఆయన కాన్వాయ్‌లోని వాహనాలు ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ ఘటన సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని బైపాస్‌రోడ్‌పై శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. విజయవాడ నుంచి హైదరాబాద్ వైపు నారాయణ స్వామి కాన్వాయ్ వెళుతోంది. ఈ క్రమంలో కోదాడ పట్టణ సమీపంలోని భారత్ పెట్రోల్ బంక్ వద్దకు రాగానే ముందు వెళుతున్న ఎస్కార్ట్ వాహనం సడన్‌గా బ్రేక్ వేసింది.
దీంతో వెనుక వాహనాలు కూడా సడన్ బ్రేకులు వేయడంతో ఒకదానికొకటి ఢీ కొన్నాయి. ఈ క్రమంలో నారాయణస్వామి ప్రయాణిస్తున్న వాహనం ముందు ఉన్న వాహనాన్ని ఢీకొన్నది. ఈ ప్రమాదంలో ఆయనకు, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ప్రమాదం జరిగిన తరువాత వాహనాలను పరిశీలించిన భద్రతా సిబ్బంది వాహనాలు సక్రమంగా ఉండడంతో వెంటనే అక్కడ నుంచి వెళ్ళిపోయారని స్థానికుల వెల్లడించారు.






