తక్షణమే రూ.2,250కోట్ల సాయం చేయండి !

27

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి శనివారం సాయంత్రం కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు లేఖ రాశారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రంలో దాదాపు రూ.4,450 కోట్ల నష్టం వాటిల్లిందని, తక్షణమే రూ.2,250 కోట్లు ఆర్థిక సాయం చేయాలని రిక్వెస్ట్ చేశారు. నష్టాన్ని అంచనా వేసేందుకు ఏపీకి కేంద్ర బృందాన్ని పంపాలని లేఖలో కోరారు. వరదలతో జన జీవనం అస్తవ్యస్తమైందని, ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రానికి కేంద్రం అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. ఇప్పటికే కరోనాతో ఆర్థికంగా నష్టపోయి ఉన్నామని, దీనికి తోడు భారీ వర్షాలు పరిస్థితిని దారుణంగా మార్చాయన్నారు.