చర్చనీయాంశంగా అనుష్క చెప్పుల ఖరీదు

by  |
anushka footwear
X

దిశ, స్పోర్ట్స్ : సెలెబ్రిటీలు ఏం చేసినా అది అభిమానులకు చర్చనీయాంశంగా మారుతుంది. టీమ్ ఇండియా ప్రస్తుతం ఇంగ్లాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనకు కెప్టెన్ విరాట్ కోహ్లీతో పాటు భార్య అనుష్క, కూతురు వామిక కూడా వెళ్లారు. అక్కడ క్వారంటైన్‌లో ఉంటూనే హోటల్ బాల్కనీ నుంచి ఏజెస్ బౌల్ స్టేడియం కనపడేలా పెట్టిన పోస్టులో ఫొటో అందరినీ ఆకట్టుకుంటున్నది. ముఖ్యంగా ఆమె వేసుకున్న చెప్పులు హాట్ టాపిక్‌గా మారాయి.

అనుష్క డ్రెసింగ్‌తో పాటు ఆమె వేసుకున్న గూచీ చెప్పులు ఆకర్షణీయంగా కనపడుతున్నాయి. ఈ చెప్పుల ధర ఎంత ఉంటుందో తెలుసుకోవడానికి అభిమానులు ఆన్‌లైన్ స్టోర్లలో వెతకడం మొదలు పెట్టారు. అయితే అనుష్క వేసుకున్న ఆ చెప్పుల ధర రూ. 31,892 అని ఒక అభిమాని కామెంట్ చేశాడు. మామూలు జనాలు అయితే వెయ్యి రూపాయలు కూడా పెట్టరు.. ఆ ధరతో మనలాంటి వారికి ఎన్ని జతల చెప్పులు వచ్చేవో అని సరదాగా కామెంట్లు చేస్తున్నారు.

Next Story