మరో ప్రాజెక్ట్‌కు కమిటైన స్వీటీ?

by  |
మరో ప్రాజెక్ట్‌కు కమిటైన స్వీటీ?
X

15 ఏళ్ల సినీ ప్రస్థానాన్ని పూర్తి చేసుకున్న అనుష్క శెట్టి (స్వీటీ).. నటనతోనే కాదు, నడవడికతోనూ ప్రేక్షకుల అభిమాన తారగా నిలిచింది. కెరీర్ స్టార్టింగ్‌లో కాస్త గ్లామర్ టచ్ ఉన్న పాత్రలకు ఓకే చెప్పిన స్వీటీ.. ఆ తర్వాత హీరోయిన్ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ వస్తోంది. సూపర్ సినిమాలో గ్లామర్ ‘షో’తో కుర్రకారును పడేసిన ఈ బెంగళూరు భామ.. అరుంధతి సినిమాలో అభినయంతో వావ్ అనిపించింది. ఇక బాహుబలిలో ‘దేవసేన’ క్యారెక్టర్ తన కెరియర్‌లోనే ‘ది బెస్ట్’ కాగా.. బాక్స్ ఆఫీస్ వద్ద భాగమతిగానూ సత్తా చాటింది. ఇప్పుడు ‘నిశ్శబ్దం’తో ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమైన భామ.. తాజాగా మరో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీకి కమిటైనట్లు ఫిల్మ్ నగర్ టాక్.

యూవీ క్రియేషన్స్ బ్యానర్‌పై తెరకెక్కనున్నఈ చిత్రానికి రారా కృష్ణయ్య.. దర్శకుడు పి. మహేష్ దర్శకత్వం వహిస్తారని సమాచారం. ప్రస్తుతం సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా.. త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉందట. నటీనటులు, టెక్నీషియన్స్ వివరాలు కూడా అప్పుడే వెల్లడిస్తారని తెలుస్తోంది. కెరియర్ స్టార్టింగ్ నుంచి ప్రయోగాలు చేస్తూనే ఉన్న స్వీటీ.. ఈ సారి ఎలాంటి సబ్జెక్ట్ ఎంచుకుని ఉంటుందోనని అభిమానులు చర్చిస్తున్నారు.

Next Story