అలియా ప్రెగ్నెంట్.. అనురాగ్ రియాక్షన్..?

by  |
అలియా ప్రెగ్నెంట్.. అనురాగ్ రియాక్షన్..?
X

దిశ, సినిమా : బాలీవుడ్ ఫిల్మ్ మేకర్ అనురాగ్ కశ్యప్ కూతురు అలియా కశ్యప్.. తన బాయ్ ఫ్రెండ్ షేన్ గ్రెగొరీతో రిలేషన్‌షిప్‌లో ఉంది. ఫాదర్స్ డే సందర్భంగా ఫ్యాన్స్ పంపిన ప్రశ్నలకు తన యూట్యూబ్ చానల్‌లో తండ్రి నుంచి సమాధానాలు రాబట్టింది. తన బాయ్‌ఫ్రెండ్ గురించి మీ అభిప్రాయమేంటి అని అనురాగ్‌ను అడిగితే.. ‘షేన్ అంటే నాకు ఇష్టం, నీ చాయిస్ నచ్చింది. తను చాలా ఆధ్యాత్మిక భావాలున్న వ్యక్తి. 40 ఏజ్‌ మెన్‌లో ఉండని చాలా క్వాలిటీస్ అతనిలో ఉన్నాయి’ అని చెప్పాడు. కాగా డేటింగ్ యాప్‌లో మీట్ అయిన ఈ జంట.. రీసెంట్‌గా యానివర్సరీ సెలబ్రేషన్స్ కూడా చేసుకున్నారు. ఇదే క్రమంలో తను ప్రెగ్నెంట్ అన్న విషయాన్ని చెప్తే ఎలా రియాక్ట్ అవుతారని అలియా ప్రశ్నించగా.. ‘ఇది నీకు కచ్చితంగా కావాలా?’ అని అడుగుతానని తెలిపాడు. అంతేకాదు ఈ విషయంలో అలియా నిర్ణయమేదైనా అంగీకరిస్తానని పేర్కొన్నాడు. కానీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరిస్తానన్న అనురాగ్.. చివరి వరకు తోడుంటానని చెప్పుకొచ్చాడు.



Next Story

Most Viewed