తిరుమల కొండపై యాంటీ డ్రోన్ టెక్నాలజీ

by  |
తిరుమల కొండపై యాంటీ డ్రోన్ టెక్నాలజీ
X

దిశ, ఏపీ బ్యూరో: ఉగ్ర కుట్రలను టెక్నాలజీతో తిప్పికొట్టేందుకు డ్రోన్ జామర్ టెన్నాలజీని తిరుమల కొండపై ఉపయోగించాలని టీటీడీ భావిస్తోంది. తిరుమలకు ఉగ్రముప్పు ఉండే అవకాశం ఉందని భద్రతా సంస్థలు వెల్లడించడంతో యాంటీ డ్రోన్ టెక్నాలజీని వినియోగించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. డ్రోన్ల దాడులను నివారించేందుకు డీఆర్డీవో యాంటీ డ్రోన్‌ టెక్నాలజీని అభివృద్ధి చేసింది. ఈ టెక్నాలజీ సహాయంతో తిరుమలలోని వెంకటేశ్వర ఆలయ రక్షణ వ్యవస్థలో ఉపయోగించనున్నారు.

ఇకపోతే జమ్మూలోని ఒక వైమానిక దళంపై ఉగ్రవాద దాడి తరువాత..యాంటీ డ్రోన్ టెక్నాలజీని డీఆర్డీవో అందుబాటులోకి తీసుకువచ్చింది. కర్ణాటకలోని కోలార్ వద్ద జూలై 6 న మూడు రకాల టెక్నాలజీని ప్రదర్శించింది. ఈ ప్రదర్శనకు టీటీడీ విజిలెన్స్, సెక్యూరిటీ వింగ్ చీఫ్ గోపీనాథ్ జెట్టి హాజరయ్యారు. ఆయన యాంటీ డ్రోన్ టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురావాలని నిర్ణయించారు. అందు కోసం రూ. 22 కోట్లు వెచ్చిస్తున్నట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed