డైరెక్టర్ ఆర్జీవీపై కేసు నమోదు

by  |
డైరెక్టర్ ఆర్జీవీపై కేసు నమోదు
X

దిశ, వెబ్‌డెస్క్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్‌ వర్మకు మరోసారి చుక్కెదురైంది. తూర్పు గోదావరి జిల్లా రాజోలు పోలీస్ స్టేషన్‌లో ఆర్జీవీపై కేసు నమోదు అయింది. ఓ ఇంటర్వ్యూలో తమను కించపరిచేలా వ్యాఖ్యలు చేశాడంటూ.. నాయిబ్రహ్మణులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రాజోలు పోలీసులు ఆర్జీవీపై కేసు నమోదు చేశారు. తమ మనోభావాలను దెబ్బతీసేలా మాట్లాడిన రామ్‌గోపాల్ వర్మను వెంటనే అరెస్ట్ చేయాలని నాయి బ్రహ్మణ సంఘాలు డిమాండ్ చేశాయి.

కాగా, తాజాగా పవర్ స్టార్, మర్డర్ సినిమాలతో వార్తల్లో నిలిచిన రామ్ గోపాల్ వర్మ చాలా ఛానెళ్లకు ఇంటర్వ్యూలు ఇచ్చారు. తన ఆఫీస్‌కు ఎవరైనా రావొచ్చని సవాల్ విసరడంతో.. పవర్ స్టార్ అభిమానులు దాడి చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ఓ ఛానల్‌కు ఇంటర్వ్యూ ఇచ్చిన వర్మ తమను కించపరిచేలా మాట్లాడారని నాయి బ్రహ్మణ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.



Next Story