ఎర్రకోట అల్లర్లలో మరో నిందితుడు అరెస్టు

by  |   (  Updated:2021-02-22 11:08:28  IST  )

<p>న్యూఢిల్లీ: రైతుల ట్రాక్టర్ పరేడ్ రోజున ఎర్రకోట అల్లర్లకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మరో నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు. జనవరి 26న ఎర్రకోటలో తల్వార్ ఆడిస్తూ కనిపించిన మనిందర్ సింగ్‌ను అరెస్టు చేసిన వారం తర్వాత తాజాగా జస్ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేశారు. మనిందర్ సింగ్ దర్యాప్తులో వెల్లడైన సమాచారం మేరకు జస్ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఆయన రెండు రోజుల పోలీసు కస్టడీలో ఉండనున్నారు. జస్ప్రీత్ సింగ్ జనవరి 26న ఎర్రకోట గుమ్మటంపైన నిలబడి [&hellip;]</p>

ఎర్రకోట అల్లర్లలో మరో నిందితుడు అరెస్టు
X

న్యూఢిల్లీ: రైతుల ట్రాక్టర్ పరేడ్ రోజున ఎర్రకోట అల్లర్లకు సంబంధించి ఢిల్లీ పోలీసులు మరో నిందితుడిని సోమవారం అరెస్టు చేశారు. జనవరి 26న ఎర్రకోటలో తల్వార్ ఆడిస్తూ కనిపించిన మనిందర్ సింగ్‌ను అరెస్టు చేసిన వారం తర్వాత తాజాగా జస్ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేశారు.

మనిందర్ సింగ్ దర్యాప్తులో వెల్లడైన సమాచారం మేరకు జస్ప్రీత్ సింగ్‌ను అరెస్టు చేశారు. ఆయన రెండు రోజుల పోలీసు కస్టడీలో ఉండనున్నారు. జస్ప్రీత్ సింగ్ జనవరి 26న ఎర్రకోట గుమ్మటంపైన నిలబడి ఒక స్టీల్ రాడ్‌ను పట్టుకుని నిలబడ్డట్టు గుర్తించారు. ఇప్పటి వరకు ఈ అల్లర్ల కేసులో సుమారు 120 మంది నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.

Next Story