రెహమాన్‌తో శంకర్‌కు విభేదాలు.. అనిరుధ్‌కు కలిసొచ్చిందా!

by  |
Shankar, Ram Charan tej, Anirudh Ravichandran
X

దిశ, సినిమా: ఇండియన్ స్పీల్‌బర్గ్ డైరెక్టర్ శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్ కాంబినేషన్‌లో వచ్చిన మూవీ ఆల్బమ్స్ అన్నీ బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్స్ అన్న విషయం తెలిసిందే. ‘జెంటిల్‌మెన్’ నుంచి ‘రోబో 2.O’ వరకు ఈ కాంబినేషన్ రిపీట్ అవుతూనే ఉంది. మధ్యలో ఒకటి రెండు సినిమాలు హరీస్ జయరాజ్ చేసినా.. రెహమాన్‌ పనితనానికే ఇంప్రెస్ అయ్యేవాడు శంకర్. కానీ కమల్ హాసన్ ‘ఇండియన్ 2’ సినిమా కోసం తన పంథా మార్చాడు. అయితే రెహమాన్‌తో శంకర్‌కు ఏమైనా విభేదాలు తలెత్తాయా? అన్న విషయంలో క్లారిటీ లేనప్పటికీ.. రాక్‌స్టార్ అనిరుధ్ రవిచంద్రన్‌ను మ్యూజీషియన్‌గా ఎంచుకోవడం అప్పట్లో చర్చనీయాంశమైంది. ఈ సినిమా మధ్యలోనే ఆగిపోయినా, తను ఇచ్చిన ట్రాక్స్‌కు ఫిదా అయిన శంకర్.. ఇప్పుడు రామ్ చరణ్‌తో చేయబోతున్న ప్రాజెక్ట్‌కు అనిరుధ్‌నే సెలెక్ట్ చేసుకున్నాడని సమాచారం. ప్రొడ్యూసర్ దిల్ రాజు, చెర్రీ కూడా అనిరుధ్ వర్కింగ్ స్టైల్, యూత్‌ తన ట్యూన్స్‌కు కనెక్ట్ అయ్యే విధానాన్ని దృష్టిలో ఉంచుకుని ఓకే చెప్పినట్లు తెలుస్తోంది.

Next Story

Most Viewed