- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నెల్లూరులో ఘనంగా యువగళం - ప్రజాగళం ర్యాలీ
రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చిన పాదయాత్ర అని నాయకులు అన్నారు.

దిశ, వెబ్ డెస్క్ : నెల్లూరు రూరల్ (Nellore Rural) నియోజకవర్గంలో యువగళం - ప్రజాగళం (Yuvagalam - Prajaa Galam) ర్యాలీ జనసంద్రంతో నిండిపోయింది. టీడీపీ (TDP) నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున కదం తొక్కి ర్యాలీకి వచ్చారు. టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి (Kotam Reddy Giridhar Reddy) ఆధ్వర్యంలో వేలాది మందితో సాగిన ర్యాలీకి నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, పార్టీ పార్లమెంటరీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ బీద రవిచంద్ర, రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ బోర్డు చైర్మన్ జెడ్.శివప్రసాద్, నగర ఇంచార్జి మేయర్ పాలుబోయిన రూప్ కుమార్ యాదవ్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ మంత్రి నారా లోకేశ్ చారిత్రాత్మక యువగళం ర్యాలీని పూర్తిచేసి నేటికి మూడు సంవత్సరాలు విజయవంతంగా పూర్తయ్యాయని తెలిపారు. అధికారంలోకి వచ్చిన తరువాత విద్యార్థులకు ఆధునిక విద్యా బోధన అందించేందుకు మంత్రి లోకేశ్ అన్ని విధాల ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్రంలోకి భారీగా పెట్టుబడులను ఆకర్షిస్తున్నారని వివరించారు. నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలను కల్పించేందుకు కృషి చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అందుబాటులో లేకున్నా ఆయన సోదరుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి ఇంత పెద్ద ర్యాలీని నిర్వహించడం గొప్ప విషయం అన్నారు.
ఎమ్మెల్సీ బీద రవిచంద్ర మాట్లాడుతూ నారా లోకేష్ యువగళం పాదయాత్ర భారతదేశ రాజకీయాలలో ఓ పెను సంచలనం అన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో భారీ స్వాగతంతో పాదయాత్ర ఊపందుకున్న విషయాన్ని గుర్తు చేశారు. అదే ఉత్సాహంతో యువగళం పాదయాత్ర విజయనగరం ముగింపు వరకు సాగిందని తెలిపారు.
మంత్రి నారా లోకేశ్ గతంలో చేపట్టిన యువగళం పాదయాత్ర ఏపీ రాజకీయాల్లో ఒక గేమ్ ఛేంజర్ గా నిలిచిందని టీడీపీ నాయకుడు కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి అన్నారు. రాష్ట్ర రాజకీయాలను సమూలంగా మార్చిందని తెలిపారు. యువగళం పాదయాత్ర రాష్ట్రంలో 97 నియోజకవర్గాలలో సాగితే అందులో 90 నియోజకవర్గాలలో కూటమి ఎమ్మెల్యేలు విజయం సాధించారని వెల్లడించారు.
నెల్లూరు ఇంచార్జి మేయర్ పాలుబోయిన రూప్ కుమార్ యాదవ్ మాట్లాడుతూ రూరల్ నియోజకవర్గంలో యువగళం ప్రజాగళం ర్యాలీని పెద్ద ఎత్తున వేలాదిమందితో నిర్వహించడం అభినందనీయం అన్నారు. ఈ కార్యక్రమంలో తనను భాగస్వామిగా చేసినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు.
జెడ్.శివప్రసాద్ మాట్లాడుతూ మంత్రి నారా లోకేశ్ యువగళం పాదయాత్రను గుర్తు చేస్తూ మళ్ళీ నెల్లూరు రూరల్ లో యువగళం - ప్రజాగళం ర్యాలీనీ నిర్వహించడం సంతోషకరంగా ఉందన్నారు.
READ MORE ....






