నేడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు

by Thanuru Gopichand |   (  Updated:2026-01-17 04:38:35  IST  )

ప్రాణాలు బలి తీసుకుంటున్న రాజీకయ కక్షలు.

నేడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ నిరసనలు
X

దిశ, వెబ్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ కక్షలు ముదిరిపోతున్నాయని వైసీపీ (YCP) ఆరోపిస్తోంది. పల్నాడు జిల్లా పిన్నెల్లి గ్రామానికి చెందిన వైసీపీ దళిత కార్యకర్త మందా సాల్మన్ (Manda Solmon) హత్యకు నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ఆందోళనలకు దిగాయి. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి (YS Jagan Mohan Reddy) పిలుపు మేరకు రాష్ట్రంలోని అన్ని జిల్లా కేంద్రాల్లోని అంబేడ్కర్ విగ్రహాల వద్ద వైసీపీ నేతలు, కార్యకర్తలు నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన చేపట్టారు. అనారోగ్యంతో ఉన్న తన భార్యను చూసేందుకు గ్రామానికి వచ్చిన సాల్మన్‌పై తెలుగుదేశం పార్టీ (TDP) నాయకులు ఇనుప రాడ్లతో దాడి చేసి అత్యంత కిరాతకంగా హతమార్చారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి విపక్ష కార్యకర్తలపై దాడులు, హత్యలు నిత్యకృత్యమయ్యాయని వారు ధ్వజమెత్తారు.

ఈ ఆందోళనల సందర్భంగా వైసీపీ నేతలు మాట్లాడుతూ.. సాల్మన్ హత్య వెనుక స్థానిక అధికార పార్టీ నేతల హస్తం ఉందని, పోలీసు వ్యవస్థ కూడా నిందితులకు వత్తాసు పలుకుతోందని విమర్శించారు. బాధితుడు కోమాలో ఉన్న సమయంలోనే అతనిపై తప్పుడు కేసులు పెట్టడం దారుణమని, హంతకులను తక్షణమే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని వారు డిమాండ్ చేశారు. దళిత బిడ్డ సాల్మన్‌కు న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆగదని, ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని పార్టీ ప్రతినిధులు స్పష్టం చేశారు. బాధితుడి కుటుంబానికి వైసీపీ అండగా ఉంటుందని భరోసా ఇస్తూ, అంబేడ్కర్ విగ్రహాల వద్ద నివాళులర్పించి ప్రజాస్వామ్యాన్ని రక్షించాలని నినదించారు. రాష్ట్రవ్యాప్తంగా ఈ నిరసనలు ఉధృతంగా కొనసాగుతుండటంతో పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

Read More..

లిక్కర్ స్కామ్ కేసులో బిగ్ అప్‌డేట్.. విజయసాయి రెడ్డికి ఈడీ నోటీసులు

Next Story