- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు.. స్పందించిన వైఎస్ జగన్
by Vemula.Srinu Prasad |
అరటి రైతుల సమస్యలపై రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ ఆందోళనలు నిర్వహించింది..

X
దిశ, వెబ్ డెస్క్: అరటి రైతుల(Banana farmers) దుస్థితిపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(YSR Congress Party) ఆందోళనలు నిర్వహించింది. రైతులు పండించే ఏ పంటకు సైతం గిట్టుబాట ధర లేనంటూ నిరసన వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆ పార్టీ అధినేత జగన్(Jagan) మాట్లాడుతూ అరటి పంటకు గిట్టుధర కల్పించాలని డిమాండ్ చేశారు. అగ్గిపెట్టే, బిస్కెట్ కంటే కూడా అరటి పండు చౌక అయిందన్నారు. రైతుల నుంచి కిలో అరటి పండ్లను 50 పైసలకే కొనుగోలు చేసి మార్కెట్‌లో రూ. 60 నుంచి రూ.70 వరకు అమ్ముతున్నారని తెలిపారు. దళారుల వల్లే ఈ దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. కష్టపడి పంట పండించిన రైతులకు కనీసం ట్రాన్స్‌పోర్టు చార్జీలు కూడా రావడంలేదని ఆరోపించారు. ‘హలో ఇండియా.. ఓ సారి రాష్ట్రంవైపు’ చూడండంటూ జగన్ పిలుపు నిచ్చారు.
Next Story






