పార్లమెంట్‌లో మా గొంతు నొక్కారు: ఉపరాష్ట్రపతికి వైసీపీ ఎంపీల కంప్లైంట్

by Vemula.Srinu Prasad |

అమరావతి చట్టబద్ధత బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఉభయసభల్లోనూ ఈ బిల్లుపై చర్చించేందుకు తగిన సమయంలో ఇవ్వలేదని వైసీపీ ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు...

పార్లమెంట్‌లో మా గొంతు నొక్కారు: ఉపరాష్ట్రపతికి వైసీపీ ఎంపీల కంప్లైంట్
X

దిశ, వెబ్ డెస్క్: అమరావతి చట్టబద్ధత బిల్లు(Amaravati Ligalization Bill)కు పార్లమెంట్ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే. అయితే ఉభయసభల్లోనూ ఈ బిల్లుపై చర్చించేందుకు తగిన సమయంలో ఇవ్వలేదని వైసీపీ ఎంపీలు(Ycp MPs) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ మేరకు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌(Vice President Radhakrishnan)కు ఫిర్యాదు చేశారు. అమరావతి బిల్లుపై తమకు తగినంత సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ(Ysr Congress Party)కి రాజ్యసభ(Rajyasabha)లో ఏడుగురు ఎంపీలుంటే 5 నిమిషాలే ఇచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. తెలుగుదేశం పార్టీ ఇద్దరు ఎంపీలుంటే 20 నిమిషాలు సమయం కేటాయించారని తెలిపారు. అమరావతికి తాము వ్యతిరేకం కాకపోయినా దుష్ప్రచారం చేస్తు్న్నారని చెప్పారు. ఇక బిల్లులో రైతులకు చేసే న్యాయంపై క్లారిటీ ఇవ్వలేదని ఉపరాష్ట్రపతి దృష్టికి తీసుకెళ్లారు. గుంటూరు-మచిలీపట్నం కారిడార్‌ను అభివృద్ధి చేయాలని జగన్ కోరినట్లు ఉపరాష్ట్రపతి రాధాకృష్ణన్‌కు వైసీపీ ఎంపీలు తెలిపారు.

Next Story