ఏపీలో ఓటర్ల తొలగింపుపై రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-12-11 12:21:10  IST  )

ఏపీలో నిజమైన ఓటర్లను తొలగిస్తున్నారంటూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి అన్నారు.....

ఏపీలో ఓటర్ల తొలగింపుపై రాజ్యసభలో వైవీ సుబ్బారెడ్డి కీలక వ్యాఖ్యలు
X

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో నిజమైన ఓటర్లను తొలగిస్తున్నారంటూ వైసీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి(YSRCP MP YV Subba Reddy) అన్నారు. ఎన్నికల సంస్కరణల(Electoral reforms)పై చర్చ సందర్భంగా ఆయన రాజ్యసభ(Rajya Sabha)లో మాట్లాడారు. ఓటర్ల విశ్వసనీయతను ఎన్నికల సంఘం దెబ్బతీసేలా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఏపీలో జరిగిన ఎన్నికల్లో అవకతవకలు జరిగాయని ఆరోపించారు. హడావుడిగా ఎస్ఐఆర్ నిర్వహించారని, దీని వల్ల తమకు చాలా అనుమానాలు కలుగుతున్నాయని తెలిపారు. పౌరులకు ఎస్ఐఆర్‌పై సమాచారం సక్రమంగా ఇవ్వలేదన్నారు. అసెంబ్లీలో ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ‌లోనూ చాలా లోపాలు బయటపడ్డాయన్నారు. మైదుకూరు, హిందూపురం నియోజవర్గాల్లో ఓటర్ల జాబితాకు మించి ఓట్లు నమోదు అయ్యాయని తెలిపారు. హిందూపురంలో పార్లమెంట్ ఎన్నికల్లో వైసీపీకి 472 ఓట్లు పడితే.. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక ఓటు మాత్రమే వచ్చిందని గుర్తు చేశారు. సాయంత్రం 6 గంటల సమయంలో పోలింగ్ ఒక్కసారిగా పెరిగిందని, టెక్నాలజీని ఉపయోగించి అక్రమాలకు పాల్పడ్డారని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.

Next Story