- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఆ విప్లవం ఇప్పుడేమైంది.. దళితులంతా ప్రశ్నించాలి: ఎంపీ గురుమూర్తి
ఏపీలో టీడీపీ ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై విచ్చలవిడిగా అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ ఎంపీ గురుమూర్తి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి దళిత గళ సమ్మేళం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... దళిత కులాలపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు...

దిశ, వెబ్ డెస్క్: ఏపీ(Ap)లో టీడీపీ(Tdp) ఎప్పుడు అధికారంలోకి వచ్చినా దళితులపై విచ్చలవిడిగా అక్రమ కేసులు పెడుతున్నారని వైసీపీ ఎంపీ గురుమూర్తి(Ycp Mp Gurumurthy) అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లి దళిత గళ సమ్మేళం కార్యక్రమంలో పాల్గొన్న ఆయన... దళిత కులాలపై వివక్ష చూపుతున్నారని మండిపడ్డారు. జగనన్న దళితులకు చేసినంత సాయం దేశంలో మరే పార్టీ, మరే నాయకుడు చేయలేదని చెప్పారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్, బాబూ జగ్జీవన్‌రామ్ కలలు కన్న సమాజ స్ధాపనకు జగనన్న పాటుపడ్డారని తెలిపారు. మనమంతా దళితుల హక్కులను కాపాడుకుందామని పిలుపునిచ్చారు. జగనన్న ప్రభుత్వంలో దళితులకు జరిగిన మంచి ఇప్పుడెందుకు జరగడం లేదని మనం ప్రశ్నించాలని ప్రశ్నించారు. నాడు నేడు పేరుతో జగనన్న తెచ్చిన విద్యా విప్లవం ఇప్పుడేమైందన్నారు. మన దళితులంతా ప్రశ్నించకపోతే ఇంకా అరాచకాలు పెరుగుతాయన్నారు. దళితులంతా సంఘటితంగా పోరాడి జగనన్నను మరోసారి అధికారంలోకి తెచ్చుకుందామని ఎంపీ గురుమూర్తి పిలుపునిచ్చారు.






