- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
BREAKING: విశాఖ భూముల కేటాయింపు రచ్చ.. మండలి నుంచి వైసీపీ వాకౌట్
విశాఖ భూముల్ని అప్పనంగా ఐటీ కంపెనీలకు కట్టబెట్టడాన్ని వైసీపీ ఎమ్మెల్సీలు ఖండించారు. అలా ఎలా ఇస్తారని అధికారపక్షాన్ని నిలదీశారు.

దిశ, వెబ్‌డెస్క్: ఏపీ శాసనమండలిలో విశాఖలో ఐటీ కంపెనీలకు 99 పైసలకే భూములు కేటాయించడంపై టీడీపీ మంత్రులు, వైసీపీ ఎమ్మెల్సీల మధ్య వాడి-వేడి చర్చ జరిగింది. రియల్ ఎస్టేట్ కంపెనీలకు కూడా భూములు ఎలా ఇస్తారని వైసీపీ ప్రశ్నించగా.. దానిపై మంత్రులు నారా లోకేశ్, అచ్చెన్నాయుడు వివరణ ఇచ్చారు. ఏపీకి కంపెనీలు రావడం వైసీపీకి నచ్చడం లేదన్నారు. విశాఖలో ఎకో సిస్టం క్రియేట్ చేయాలంటే పెద్ద కంపెనీలు రావాలని, అందుకే ఐదు కంపెనీలకు భూములు లీజుకిచ్చామన్నారు. ఒక్క విశాఖలోనే 5 లక్షల ఐటీ ఉద్యోగాలు కల్పిస్తామని లోకేశ్ తెలిపారు. ఇతర రాష్ట్రాల్లో కంపెనీలు కోట్లు ఖర్చుచేసి భూములు కొంటుంటే.. విశాఖలో విలువైన భూముల్ని అతితక్కువకే ఇవ్వడాన్ని ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ తప్పుపట్టారు. రూ.5 వేల కోట్ల విలువైన భూముల్ని గీతం యూనివర్సిటీకి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. ఈ విషయంపై అధికార- విపక్షాల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. విలువైన విశాఖ భూములను అప్పనంగా కట్టబెట్టారని విపక్ష సభ్యులు ఆరోపించారు. ప్రభుత్వం భూదోపిడీకి పాల్పడుతోందన్నారు. ఈ క్రమంలో వైసీపీ సభ్యులు శాసనమండలి నుంచి వాకౌట్ చేశారు. దీంతో వైసీపీకి వాకౌట్ చేయడం ఒక అలవాటుగా మారిందని నారా లోకేశ్ విమర్శించారు.






