- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
చివరి నిమిషంలో ట్విస్ట్.. రాజీనామా ఉపసంహరించుకున్న ఎమ్మెల్సీ
చివరి నిమిషంలో ట్విస్ట్.. రాజీనామా ఉపసంహరించుకున్న ఎమ్మెల్సీ

దిశ, వెబ్‌డెస్క్: ఎమ్మెల్సీల రాజీనామాల విషయంలో అనూహ్య పరిణామం చోటుచేసుకుంది. వైసీపీ ఎమ్మెల్యేలు ఇవాళ మండలి చైర్మన్‌ను కలిసి రాజీనామాలు ఆమోదించాలని కోరిన విషయం తెలిసిందే. అయితే.. చివరి నిమిషంలో తన రాజీనామా ఉప సంహరించుకుంటున్నట్లు ఎమ్మెల్సీ జాకియా ఖానం(Zakia Khanam) మండలి చైర్మన్‌కు చెప్పారు. ప్రస్తుతం జాకియా ఖానం మండలి వైస్ చైర్‌పర్సన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. మరోవైపు ఉదయం రాజీనామా చేసిన ఎమ్మెల్సీలంతా కలిసి.. తాము స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్నట్లు చైర్మన్‌కు వివరించారు. ఎవరి ప్రోద్భలంతో అయినా రాజీనామా చేశారా అని చైర్మన్ ప్రశ్నించగా.. రాజీనామా పత్రాలు తామే స్వయంగా తీసుకొచ్చామని.. స్వచ్ఛందంగానే రాజీనామా చేస్తున్న విషయాన్ని ఇప్పటికే చాలాసార్లు చెప్పినట్లు చైర్మన్‌కు ఎమ్మెల్సీలు సమాధానం ఇచ్చారు. కానీ అంతలోనే జాకియా ఖానం మాత్రం యూటర్న్ తీసుకోవడం రాష్ట్రంలో హాట్ టాపిక్‌గా మారింది.






