విశాఖలో భూ దోపిడీ... బాలకృష్ణ అల్లుడి వర్సిటీపై బొత్స సంచలన ఆరోపణలు

by Vemula.Srinu Prasad |   (  Updated:2026-01-28 08:45:41  IST  )

విశాఖలో భూముల కబ్జాలపై వైసీపీ ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన ఆరోపనలు చేశారు..

విశాఖలో భూ దోపిడీ... బాలకృష్ణ అల్లుడి వర్సిటీపై బొత్స సంచలన ఆరోపణలు
X

దిశ, వెబ్ డెస్క్: విశాఖ(Visakha)లో భూముల(Lands) విలువ విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. అయితే అటు ప్రభుత్వం(Government) సైతం ఈ ఉక్కు నగరాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే భోగాపురం ఎయిర్‌పోర్టు(Bhogapuram Airport)తో పాటు పలు ప్రాజెక్టులకు శ్రీకారం చుట్టింది. దీంతో ఈ నగరంలో భూముల విలువలకు ఒక్కసారిగా రెక్కలు వచ్చాయి. వేలల్లో ఉన్న ధరలు లక్షల్లోకి చేరుకున్నాయి. ఇక ఎకరాలైతే కోట్లలోకి వెళ్లిపోయాయి. నగరం నాలుగు వైపులా కూడా భూముల ధరలు భగ్గుమంటున్నాయి. ఈ నేపథ్యంలో భూ కబ్జాలు కూడా విపరీతమయ్యాయి. ఖాళీ జాగా కనిపిస్తే చాలు కొందరు గద్దల్లా వాలిపోతున్నారు. తమదని బోర్డు పెట్టేస్తున్నారు.

అధికార పార్టీ నేతలపై వైసీపీ ఆరోపణలు

అటు ప్రైవేటు వ్యక్తులే అనుకుంటే ప్రభుత్వంలో ఉన్న పెద్దలు సైతం కబ్జాలకు పాల్పడుతున్నారంటూ విశాఖ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు ఆరోపిస్తున్నారు. గత ఐదేళ్లలోనూ విశాఖలో భూములు కబ్జాలు జరిగినప్పటికీ ప్రస్తుత అధికార పార్టీ నేతలపై సంచలన ఆరోపణలు చేస్తున్నారు. తాజాగా మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్సీ బొత్స సత్యనారాయణ సంచలన వ్యాఖ్యలు చేశారు. విశాఖలో గీతం యూనివర్సీటీ భూములు కబ్జా చేసిందని ఆరోపించారు. రూ. 5 వేల కోట్ల విలువైన భూములను గీతంకు ప్రభుత్వ పెద్దలు కట్టబెట్టారని వ్యాఖ్యానించారు. ఈ భూములను తాము పరిశీలిస్తామని, శుక్రవారంన విశాఖలో నిరసన చేపడతామని చెప్పారు. విశాఖలో ప్రభుత్వ పెద్దల నుంచి భూములను రక్షించాలని గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తామని ఎమ్మెల్సీ బొత్స హెచ్చరించారు.

Next Story