నేను పరారీలో లేను.. నా భార్యను అన్యాయంగా ఇరికించారు : ఎమ్మెల్సీ అనంతబాబు

by Naga Rani Yarlagadda |

డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో తన భార్యను చేర్చడంపై ఎమ్మెల్సీ అనంతబాబు తీవ్ర అసహనం వ్యక్తం చేశారు.

నేను పరారీలో లేను.. నా భార్యను అన్యాయంగా ఇరికించారు : ఎమ్మెల్సీ అనంతబాబు
X

దిశ, వెబ్‌డెస్క్: డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్యకేసులో తన భార్యను అన్యాయంగా ఇరికించారని ఎమ్మెల్సీ అనంతబాబు మీడియా ముందు వాపోయారు. తాను పరారీలో లేనని, తనకు ఎలాంటి నోటీసులు రాలేదన్నారు. వ్యక్తిగత పనులతో బిజీగా ఉండటం వల్ల పరారీలో ఉన్నట్లుగా ప్రచారం చేస్తున్నారన్నారు. డిఫాల్ట్ గా ఉన్న బెయిల్ ను సుప్రీంకోర్టు పర్మినెంట్ చేసిందని స్పష్టం చేసిందన్నారు. కూటమి ప్రభుత్వం తనను, తన కుటుంబాన్ని తీవ్రంగా వేధిస్తోందని ఆరోపించారు. అందులో భాగంగానే తన భార్యను టార్గెట్ చేశారని తెలిపారు. గతంలో నోటీసులు వచ్చినపుడే హైకోర్టులో చాలెంజ్ చేయగా.. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకూ ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పిందని గుర్తుచేశారు. తన భార్య కోసం న్యాయపోరాటం చేస్తానని పేర్కొన్నారు.

తిరుమల లడ్డూ నెయ్యి కల్తీ అంశాన్ని డైవర్ట్ చేసేందుకే కూటమి ప్రభుత్వం.. తన డ్రైవర్ హత్యకేసును హైలైట్ చేస్తుందన్నారు. వైసీపీలో యాక్టివ్ గా ఉన్నవారిని ఏదొకరకంగా ఇబ్బంది పెడుతున్నారని వాపోయారు. కాగా.. డ్రైవర్ హత్యకేసులో అరెస్టయ్యాక పోలీసులు తనకు సహకరించారని వస్తున్న వార్తల్లో నిజం లేదన్నారు. అదే జరిగితే ఏడునెలలు జైల్లో ఉండాల్సిన పనిలేదన్నారు. 90 రోజులకే బెయిల్ పై బయటికి వచ్చేవాడినని, దీనిని బట్టి తనకెవరూ సహకరించలేదని తెలుస్తుందన్నారు. తనకు జరిగినదాన్ని పార్టీతో లింక్ పెట్టి చూడొద్దని విజ్ఞప్తి చేశారు. ఈ విషయాన్ని ఒక క్యాస్ట్ కు, పార్టీకు ఆపాదించి చూడొద్దన్నారు.

Next Story