‘మహానాడు ముంగిట మాయాజూదం’.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు.

‘మహానాడు ముంగిట మాయాజూదం’.. వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: ఏపీలో ఎన్డీయే కూటమి ప్రభుత్వం పై వైసీపీ నేతలు సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. రాష్ట్రం(Andhra Pradesh)లో కూటమి ప్రభుత్వం(AP Government) ఏర్పడి ఏడాది కావస్తున్న సూపర్ సిక్స్(Super Six) ఊసే లేదని విమర్శలు గుప్పిస్తున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఎప్పుడు అమలు చేస్తోందని ప్రశ్నిస్తున్నారు. హామీల అమలు మరిచారని దుయ్యబట్టారు. అక్రమ కేసులు పెట్టి వైసీపీ నేతలు, కార్యకర్తలను ఇబ్బంది పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఈ తరుణంలో తాజాగా కూటమి ప్రభుత్వ తీరుపై వైసీపీ ఎమ్మెల్యే(YCP MLA) తాటిపర్తి చంద్రశేఖర్(Tatiparthi Chandrashekar) మండిపడ్డారు. ఈ క్రమంలో ‘‘మహానాడు ముంగిట మాయాజూదం. కాకాణి గోవర్ధన్ అక్రమ అరెస్ట్, మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పై అక్రమ కేసు, మాజీ మంత్రి సీదిరి పై అనుచిత ప్రవర్తన’’ అని ట్విట్టర్ వేదికగా సంచలన వ్యాఖ్యలు చేశారు. అయితే.. మైనింగ్ కేసులో మాజీ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డిని అరెస్ట్ చేయగా పల్నాడులో జంట హత్యల వ్యవహారంలో పిన్నెల్లి పై కేసు నమోదైంది. వజ్రపుకొత్తూరు లో కూల్చివేతలను అడ్డుకున్న సీదిరిని సీఐ దుర్భాషలాడారు.

Next Story