- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు వైసీపీ ఎమ్మెల్యే భూమన మాస్ వార్నింగ్
మీరు భయపెడితే, భయపడే వాళ్లం కాదని, అంతకంతకు బదులు తీర్చుకుంటామని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు.

దిశ, వెబ్ డెస్క్: మీరు భయపెడితే, భయపడే వాళ్లం కాదని, అంతకంతకు బదులు తీర్చుకుంటామని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కు వైసీపీ ఎమ్మెల్యే (YCP MLA) భూమన కరుణాకర్ రెడ్డి (Bhumana Karunakar Reddy) మాస్ వార్నింగ్ ఇచ్చారు. తిరుపతి డిప్యూటీ మేయర్ ఎన్నిక నేపథ్యంలో వైసీపీ కార్పోరేటర్లు (YSRCP corporators) ఉన్న నివాసాలపై జనసేన నేతలు (Jana Sena leaders) జరిపిన దాడిపై స్పందించిన ఆయన.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కూటమి ప్రభుత్వంలో దౌర్జన్య కాండ అంతులేకుండా పోతోందని, చంద్రబాబు పాలన (Chandrababu's rule)లో దుర్మార్గాలు జరుగుతున్నాయని చెప్పడానికి రాత్రి జరిగిన ఘటనలే నిదర్శనమని అన్నారు.
మా కార్పోరేటర్లు చిత్తూరు (Chittoor)లో ఉంటే, ఆడవాళ్లు అని కూడా చూడకుండా అర్థరాత్రి ప్రతీ గది తలుపు తట్టి, బెదిరింపులకు గురి చేశారని చెప్పారు. మీరు వైసీపీ(YCP)కి ఓటు వేస్తే మీ అంతు చూస్తామని అసభ్యపద జాలంతో మాట్లాడుతూ.. బెదిరించారని అన్నారు. చిత్తూరు నుంచి ఈ ప్రాంతానికి దిగుమతి అయిన ఆరణి శ్రీనివాసులు (Arani Srinivasulu) కొడుకు దానికి న్యాయకత్వం వహించారని తెలిపారు. ఈ చర్యలు చంద్రబాబు (Chandrabau), లోకేష్ (Lokesh), పవన్ కళ్యాణ్ లకు సిగ్గుచేటు అని మండిపడ్డారు. ఏదైనా అంటే వైసీపీ పాలనలో కూడా మీరు ఇలాంటివే చేశారని మాట్లాడుతున్నారని, ఇదేనా ప్రజాస్వామ్యం అంటే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ కార్పోరేటర్లను టార్గెట్ చేసి, మీ ఆస్తులు లాక్కుంటామని, మీ అంతు చూస్తామని చెప్పి ప్రలోభ పెట్టే ప్రయత్నాలు చేయడం దుర్మార్గమని అన్నారు.
పవన్ కళ్యాణ్ ఎప్పుడు మహిళలు.. మహిళలు అని మాట్లాడుతాడని, ఆయన గుండాలు చేసిన దౌర్జన్యం చూడాలని హితవు పలికారు. మీ కథ చాలా గొప్పగా నడిచిందని అనుకుంటే చాలా తప్పు అని, అంతకంతకు బదులు తీర్చుకుంటామని హెచ్చరించారు. మీరు చేసిన దౌర్జన్యాలకు సంబంధించిన వీడియోలు అన్నీ బయటకి వచ్చాయని, మీరు దాచుకోవాలని ప్రయత్నించినా దాగవని అన్నారు. మీ పచ్చ పత్రికల్లో మాయమాటలు చెప్పి, ప్రజలను మోసగించాలని చూసినా చెల్లదని, ఈ దౌర్జన్య కాండకు ప్రజలు బుద్ది చెప్పే రోజు త్వరలోనే వస్తుందని భూమన అన్నారు.






