‘థియేటర్ల బంద్‌తో నాకు సంబంధం లేదు’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు

by Jakkula.Mamatha |

పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వేళ థియేటర్లు బంద్ అనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

‘థియేటర్ల బంద్‌తో నాకు సంబంధం లేదు’.. వైసీపీ నేత సంచలన వ్యాఖ్యలు
X

దిశ,వెబ్‌డెస్క్: పవన్ కళ్యాణ్ సినిమా విడుదల వేళ థియేటర్లు బంద్ అనే ప్రచారం రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. అయితే థియేటర్ల బంద్ అనే వార్తలపై పలువురి పై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో వైసీపీ నేత, మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ స్పందించారు. సినీ పరిశ్రమకు చెందిన థియేటర్ల బంద్ వివాదంలో తనను లాగొద్దని వైసీపీ నేత ద్వారంపూడి చంద్రశేఖర్ స్పష్టం చేశారు. కొందరు ఎగ్జిబిటర్లతో కలిసి తాను థియేటర్లు మూసే ప్రయత్నాలు చేస్తున్నట్లు జరుగుతున్న ప్రచారం పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

‘హరిహర వీరమల్లు’ మూవీ విడుదల కాకుండా తనతో పాటుగా కొంత మంది సినీ నిర్మాతలు కుట్ర చేస్తున్నారని జరుగుతున్న ప్రచారం పూర్తిగా అవాస్తవం అని ఆయన తేల్చి చెప్పారు. ఆ ఆరోపణల్లో వాస్తవం లేదని ద్వారంపూడి ఖండించారు. ఈ క్రమంలో ‘‘ఇష్టమొచ్చినట్లు ఆరోపణలు చేయొద్దు.. ఆధారాలు ఉంటే చూపించండి’’ అంటూ ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. నట్టి కుమార్ చేసిన వ్యాఖ్యలు ఏ మాత్రం ధ్రువీకరించకుండా మీడియా సంస్థలు ప్రసారం చేశాయి. ఇది ఎంతవరకు కరెక్ట్ అని వైసీపీ నేత ద్వారంపూడి ప్రశ్నించారు.

Next Story