- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
తురకా కిషోర్‌కు ఊరట.. హైకోర్టు కీలక ఆదేశాలు
by Vemula.Srinu Prasad |
వైసీపీ నేత తురకా కిషోర్‌కు హైకోర్టులో ఊరట లభించింది...

X
దిశ, వెబ్ డెస్క్: మాచర్ల మున్సిపల్ మాజీ చైర్మన్, వైసీపీ నేత తురకా కిషోర్(YSRCP leader Turaka Kishore)కు హైకోర్టు(Highcourt)లో ఊరట లభించింది. తక్షణమే ఆయన్ను విడుదల చేయాలని ఆదేశాలు జారీ చేసింది. కిషోర్ అరెస్ట్ విషయంలో పోలీసులను కోర్టు తప్పబట్టింది. చట్ట నిబంధనలను ఉల్లంఘించారని మండిపడింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రాసిక్యూషన్‌కు సూచించింది. కాగా తురకా కిషోర్ పై పలు కేసులు ఉన్నాయి. ఈ కేసుల్లో ఇప్పటికే జైలుకు వెళ్లి బెయిల్ పై విడుదల అయ్యారు. అయితే జైలు నుంచి విడుదల అయిన వెంటనే ఆయన్ను మరో కేసులో పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. ఈ కేసు విషయంలో తురకా కిశోర్ తరపున హైకోర్టులో వాదనలు వినిపించారు. దీంతో ఆయన్ను వెంటనే విడుదల చేయాలని ధర్మాసనం ఆదేశించింది.
Next Story






