అమరావతి ఒక్కటే ఉందా.. పోలవరం ఏమైంది: మల్లాది విష్ణు

by Vemula.Srinu Prasad |

రాష్ట్రంలో అమరావతి ఒక్కటే ఉందా అని, పోలవరం ఏమైందని వైసీపీ నేత మల్లాది విష్ణు ప్రశ్నించారు...

అమరావతి ఒక్కటే ఉందా.. పోలవరం ఏమైంది: మల్లాది విష్ణు
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో అమరావతి(Amaravati) ఒక్కటే ఉందా అని, పోలవరం(Polavaram) ఏమైందని వైసీపీ నేత మల్లాది విష్ణు(Ycp Leader Malladi Vishnu) ప్రశ్నించారు. అమరావతి చట్టబద్ధత బిల్లు లోక్‌సభ(Loksabha)లో ఆమోదం పొందిన వేళ ఆయన స్పందించారు. ఏపీ రాజధాని అమరావతి(Ap Capital Amaravati)కి తాము వ్యతిరేకమని ప్రచారం చేస్తున్నారని మల్లాది విష్ణు మండిపడ్డారు. అమరావతిని నిర్మించొద్దని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ చెప్పలేదన్నారు. రాజధాని పేరుతో జరిగే అవినీతిని తాము వ్యతిరేకిస్తున్నామని మల్లాది విష్ణు చెప్పారు.

అమరావతి చట్టబద్ధత బిల్లుకు లోక్ సభ ఆమోదం

కాగా అమరావతి చట్టబద్ధత బిల్లును బుధవారం ఉదయం లోక్ సభలో ప్రవేశపెట్టారు. దీంతో ఎంపీలు సుదీర్ఘంగా చర్చించి బిల్లుకు ఆమోదం తెలిపారు. గురువారం రాజ్యసభ ముందుకు రానుంది. అయితే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అమరావతి చట్టబద్ధత బిల్లుకు వ్యతిరేకమని లోకసభ నుంచి వాకౌట్ చేసింది. ఈ మేరకు వైసీపీ ఎంపీల తీరును కూటమి సభ్యులు తప్పుబట్టారు. రాష్ట్రంలో జరిగిన అసెంబ్లీకి సైతం గౌర్హాజరయ్యారని, లోకసభ నుంచి కూడా వెళ్లిపోయారని ఎద్దేవా చేశారు. ఈ క్రమంలో మల్లాది విష్ణు విజయవాడలో మీడియాలో మాట్లాడారు. రాజధానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకంకాదని వివరించారు.

Next Story