- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వీళ్ల వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరిగింది: లక్ష్మీపార్వతి
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరిగిందని వైసీపీ మహిళా నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై ఆమె మండిపడ్డారు...

దిశ, వెబ్ డెస్క్: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్(Deputy Cm Pawan Kalyan) వల్ల రాష్ట్రానికి ఏం మేలు జరిగిందని వైసీపీ మహిళా నాయకురాలు నందమూరి లక్ష్మీపార్వతి(Nandamuri Laxmi Parvati) ప్రశ్నించారు. రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, అత్యాచారాలపై ఆమె మండిపడ్డారు. ఎమ్మెల్యేలే మహిళలపై దారుణాలకు పాల్పడటం సిగ్గేచేటని ధ్వజమెత్తారు. ఈ పాపాలను జనసేన కూడా పంచుకుంటోందని ఆరోపించారు. రాష్ట్రం అత్యాచారాల ఏపీగా మారిందని విమర్శించారు. కళ్ల ముందే మహిళపై అఘాయిత్యాలు జరుగుతుంటే పోలీసులు సైతం ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని లక్ష్మీపార్వతి ఆవేదన వ్యక్తం చేశారు.
ఎమ్మెల్యేలే..
కిరణ్ రాయల్, అరవ శ్రీధర్, కోనేటి ఆదిమూలం, నసీర్ అహ్మద్, రవికుమార్ కూన ఇలా చెప్పుకుంటూ పోతే చాలా మంది మహిళలను వేధించారని లక్ష్మీపార్వతి ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు దేవుడే లేడన్న చంద్రబాబు నాయుడు(Chandrababu) ముఖ్యమంత్రి అయ్యారని, తన తండ్రి సిగరెట్‌ను పూజ దీపంతో వెలిగిస్తాడని చెప్పిన పవన్ కల్యాణ్(Pawan Kalyan) డిప్యూటీ సీఎం అయ్యారని ఎద్దేవా చేశారు. ఇప్పుడు వీళ్లిద్దరూ మహిళలు అడ్డంపెట్టుకుని నీచ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడి(TTD Chairman BR Naidu) రాసలీలల వీడియోలు బయటకు ఇప్పుడు వరకూ ఎలాంటి చర్యలు తీసుకోలేదని విమర్శించారు. ఓ మహిళ తనకు జరిగిన అన్యాయంపై స్వయంగా లేఖ రాసినా చంద్రబాబు ఎందుకు పట్టించుకోలేదని లక్ష్మీపార్వతి ఆరోపించారు.






