గుడివాడ కోర్టుకు కొడాలి నాని.. ఎందుకంటే..

by Naga Rani Yarlagadda |   (  Updated:2025-06-27 12:56:58  IST  )

చాలాకాలం తర్వాత వైఎస్సార్సీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) గుడివాడలో మళ్లీ కనిపించారు.

గుడివాడ కోర్టుకు కొడాలి నాని.. ఎందుకంటే..
X

దిశ, వెబ్‌డెస్క్: చాలాకాలం తర్వాత వైఎస్సార్సీపీ కీలక నేత, మాజీ మంత్రి కొడాలి నాని (kodali nani) గుడివాడలో మళ్లీ కనిపించారు. శుక్రవారం ఆయన స్థానిక కోర్టుకు హాజరయ్యారు. ప్రస్తుతం వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్‌గా ఉన్న రావి వెంకటేశ్వరరావు‌కు చెందిన ఒక వస్త్ర దుకాణంపై జరిగిన దాడి కేసులో ముందస్తు బెయిల్ కోసం కొడాలి నాని హైకోర్టును (ap high court) ఆశ్రయించారు.

ఈ దరఖాస్తును పరిశీలించిన హైకోర్టు.. కింది స్థాయి కోర్టులో ష్యూరిటీ పత్రాలు సమర్పించాలని ఆదేశించడంతో, నాని గుడివాడ కోర్టుకు వచ్చారు. అదే కేసులో ఇప్పటికే ఆయన అనుచరుల్లో 16 మందికి బెయిల్ మంజూరైంది. విచారణ సందర్భంగా కొందరు అనుచరులు పోలీసుల ఎదుట నాని సూచన మేరకే దాడికి పాల్పడ్డామని చెప్పినట్టు సమాచారం. 2024 సార్వత్రిక ఎన్నికల అనంతరం సుదీర్ఘ విరామం తర్వాత గుడివాడలో కొడాలి నాని కనిపించడంతో.. కోర్టు వద్ద వైసీపీ కార్యకర్తలు హడావిడి చేశారు.

Next Story