వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి బిగ్ షాక్.. ప్రొటెస్ట్ పిటిషన్ తిరస్కరణ

by Vemula.Srinu Prasad |

ఫైబర్ నెట్ కేసులో వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి బిగ్ షాక్ తగిలింది..

వైసీపీ నేత గౌతమ్ రెడ్డికి బిగ్ షాక్.. ప్రొటెస్ట్ పిటిషన్ తిరస్కరణ
X

దిశ, వెబ్ డెస్క్: ఫైబర్ నెట్ కేసు(Fiber net case)కు సంబంధించి ఫిర్యాదుదారుడు వైసీపీ నేత గౌతమ్ రెడ్డి(YSRCP leader Gautam Reddy)కి బిగ్ షాక్ తగిలింది. ఈ కేసును క్లోజ్ చేయొద్దంటూ విజయవాడ ఏసీబీ కోర్టు(Vijayawada ACB Court)లో ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. పిటిషన్‌పై ఈ నెల 9న విచారణ జరిపిన ధర్మసనం ఉత్తర్వులను వాయిదా వేసింది. తిరిగి ఈ రోజు విచారణ చేపట్టి గౌతమ్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తిరస్కరించింది.

కాగా 2011-19 చంద్రబాబు హయాంలో ఫైబర్ నెట్ టెండర్లకు సంబంధించిన వ్యవహారంలో అవకతవకలు జరిగాయని 2023లో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసింది. బ్లాక్ లిస్టులో ఉన్న టెర్రా సాఫ్ట్ సంస్థకు నిబంధనలకు విరుద్ధంగా టెండర్లు ఇచ్చారని ఎఫ్ఐఆర్‌లో సీఐడీ అధికారులు పేర్కొన్నారు. ఈ కేసులో చంద్రబాబును నిందితుడిగా చేర్చారు.

అయితే ఇటీవల ఈ కేసులో చంద్రబాబుకు ఉపశమనం కలిగింది. ఎలాంటి ఆధారాలు లేవనే కారణంగా కేసును మూసివేస్తున్నట్లు కోర్టు తీర్పు ఇచ్చింది.

దీంతో వైసీపీ నేత గౌతమ్ రెడ్డి అభ్యంతరం వ్యక్తం చేశారు. తన ఫిర్యాదుతో ఏపీ ఫైబర్ నెట్ కేసు ప్రారంభమైందని, తన వాదనలు వినకుండా ఎలా మూసివేస్తారని ఆయన ప్రశ్నించారు. ఫైబర్ నెట్ కేసును క్లోజ్ చేయొద్దంటూ ప్రొటెస్ట్ పిటిషన్ దాఖలు చేశారు. అధికారాన్ని ఉపయోగించి చంద్రబాబు కేసు నుంచి తప్పించుకునే ప్రయత్నం జరిగిందని ఆరోపించారు. కేసును క్లోజ్ చేయొద్దని తెలిపారు. అయితే విచారించిన కోర్టు పిటిషన్‌ను తిరస్కరించింది.

Next Story