జైల్లో నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి: లిక్కర్ కేసులో చెవిరెడ్డి కీలక రిక్వెస్ట్

by Vemula.Srinu Prasad |

జైల్లో తనకు వసతులు కల్పించాలని ఏసీబీ కోర్టులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు..

జైల్లో నాకు ఆ ఛాన్స్ ఇవ్వండి: లిక్కర్ కేసులో చెవిరెడ్డి కీలక రిక్వెస్ట్
X

దిశ, వెబ్ డెస్క్: లిక్కర్ స్కామ్ కేసు(Liquor Scam Case)లో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి(Ycp Leader Chevireddy Bhaskar Reddy) అరెస్ట్ అయి జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న విషయం తెలిసిందే. అయితే తాజాగా ఏసీబీ కోర్టు(ACB Court)లో ఆయన పిటిషన్ దాఖలు చేశారు. జైల్లో తనకు వసతులు కల్పించాలని, బయట ఆహారం తెప్పించుకునేందుకు అవకాశం కల్పించాలని కోరారు. ఈ పిటిషన్‌పై ధర్మాసనం సోమవారం విచారణ జరపనుంది.

కాగా ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కరెడ్డి 38వ నిందితుడిగా ఉన్నారు. ఇదే కేసులో మరో వైసీపీ నేత వెంకటేశ్ నాయుడు ఏ34గా ఉన్నారు. దీంతో వీరిద్దరిని అరెస్ట్ చేసి జైలుకు తరలించారు. మరోవైపు ఇదే కేసులో ఏ39గా ఉన్న చెవిరెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డి తాజాగా ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పైనా ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టనుంది.

Next Story