- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నన్ను పాయింట్ బ్లాక్‌లో పెట్టి షూట్ చేయండి: బోరుగడ్డ అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు
పవన్ కల్యాణ్ పిల్లలపై అసభ్యంగా మాట్లాడి ఉంటే తనను చంపేయండని వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్ అన్నారు..

దిశ, వెబ్ డెస్క్: జనసేన అధినేత పవన్ కల్యాణ్(Janasena Chief Pawan Kalyan) పిల్లలపై తాను వివాదాస్పద వ్యాఖ్యలు చేసి ఉంటే రివాల్వర్‌తో పాయింట్ బ్లాక్‌లో పెట్టి షూట్ చేయండని వైసీపీ నేత బోరుగడ్డ అనిల్ కుమార్(Ycp Leader Borugadda Anil Kumar) అన్నారు. పవన్ కల్యాణ్ ఫ్యామిలీపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలపై ఆయన స్పందించారు. పవన్ కల్యాణ్‌పై రాజకీయంగా కొన్ని ఆవేశపూరిత వ్యాఖ్యలు చేశానని, కానీ ఆయన ఫ్యామిలీని తానెప్పుడు తిట్టలేదని, కించపర్చేలా మాట్లాడలేదని చెప్పారు. పవన్ కల్యాణ్ సిస్టర్స్ తనకు సిస్టర్స్‌తో సమానమని అనిల్ తెలిపారు.
రాజకీయంగా ప్రత్యర్థులను ఫేస్ చేయడానికి ఆవేశంగా మాట్లాడి తప్పు చేశానని అనిల్ కుమార్ చెప్పారు. ప్రత్యర్ధులు కామెంట్స్ చేశారు కాబట్టి మళ్లీ తిరిగి తిట్టాలని రాజకీయ నాయకుడికి ఉంటుందన్నారు. తన ఫ్యామిలీని కూడా టీడీపీ(Tdp), జనసేన(Janasena) కార్యకర్తలు బూతులు తిట్టారని తెలిపారు. గుంటూరు(Guntur)లో తన ఫ్యామిలీ ఆస్పత్రికి వెళితే జనసేన కార్యకర్తలు దాడి చేశారని, కార్లు ధ్వంసం చేశారని, తన కార్యాలయాన్ని కూడా తగలబెట్టారని గుర్తు చేశారు. జగన్, భారతి ఫొటోలు పెట్టి గుంటూరులో అన్నదాన కార్యక్రమం చేస్తున్నానని ఓర్చుకోలేక తన ఫ్యామిలీ, కార్యాలయంపై దాడి చేశారని బోరుగడ్డ అనిల్ కుమార్ పేర్కొన్నారు.






