అశోక్ గజపతిరాజుకి గవర్నర్ పదవి.. పొగడ్తలతో ముంచెత్తిన వైసీపీ నేత

by Vemula.Srinu Prasad |   (  Updated:2025-07-16 07:07:02  IST  )

టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతి రాజుకు గవర్నర్ పదవి ఇవ్వడంపై వైసీపీ నెల్లిమర్ల ఇన్‍చార్జ్ బడ్డుకొండ అప్పలనాయుడు హర్షం వ్యక్తం చేశారు..

అశోక్ గజపతిరాజుకి గవర్నర్ పదవి.. పొగడ్తలతో ముంచెత్తిన వైసీపీ నేత
X

దిశ, వెబ్ డెస్క్: టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు(Ashok Gajapati Reju)ను కేంద్రం గోవా గవర్నర్‌(Goa Governor)గా నియమించిన విషయం తెలిసిందే. అయితే రాష్ట్రంలో ఆయనపై పార్టీలకతీతంగా ప్రశంసలు కురుస్తున్నారు. టీడీపీ(Tdp) నేతలే కాదు.. వైసీపీ శ్రేణులు సైతం పొగడ్తలు కురిపిస్తున్నారు. అశోక్ గజపతిరాజుకు గవర్నర్ పదవి ఇవ్వడంపై వైసీపీ నెల్లిమర్ల ఇన్‍చార్జ్ బడ్డుకొండ అప్పలనాయుడు(YCP Nellimarla in-charge Baddukonda Appalanaidu) హర్షం వ్యక్తం చేశారు.

‘‘గజపతిరాజు ఈ ప్రాంతానికి ఖ్యాతి రెచ్చిన మహానుభావులు. నీతి, నిజాయితీతో కూడిన రాజకీయాలు చేశారు కాబట్టే ఉన్నతమైన పదవులు దక్కాయి. అశోఖ్ గజపతిరాజు ఏ జన్మలోనో చేసుకున్న పుణ్యమో. పదవి ఇచ్చిన బీజేపీకి ధన్యవాదాలు.’’ అని అప్పలనాయుడు పొగడ్తలు కురిపించారు. దీంతో అప్పలనాయుడు వ్యవహారం జిల్లాలో హాట్ టాపిక్‌గా మారింది.

Next Story