- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
YSRCP: ఆంధ్రా పాలిటిక్స్‌లో కీలక పరిణామం.. రేపు వైసీపీలో చేరనున్న మాజీ మంత్రి

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రా పాలిటిక్స్ (Andhra Pradesh Politics)లో కీలక పరిణామం చోటుచేసుకోబోతోంది. ఏపీ మాజీ పీసీసీ చీఫ్, మాజీ మంత్రి సాకె శైలజానాథ్ (Shailajanath) అధికార కూటమి పార్టీలను కాదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YSR Congress Party)లో చేరేందుకు సిద్ధమయ్యారు. ఇటీవలే ఆయన జగన్ (Jagan)తో భేటీ కాగా ఆయన చేరికకు గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చారు. దీంతో ఆయన అధికారికంగా వైసీపీ (YCP)లో చేరేందుకు సన్నద్ధం అవుతున్నారు. గురువారం ఉదయం 10 గంటలకు తాడేపల్లి (Thadepally)లోని వైసీపీ ప్రధాన కార్యాలయంలో జగన్ సమక్షంలో శైలజానాథ్ (Shailajanath) ఆ పార్టీ కండువా కప్పుకోనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు వైసీపీ నాయకులు, శైలజానాథ్ మద్దతుదారులు పెద్ద ఎత్తున హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి.
కాగా, శింగనమల (Shinganamala) నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన శైలజానాథ్ (Shailajanath), రాష్ట్ర విభజన తర్వాత కాంగ్రెస్ పార్టీ బలహీనపడటంతో ప్రత్యక్ష రాజకీలయాలకు దూరంగా ఉంటూ వచ్చారు.. శైలజానాథ్, వైఎస్సార్ (YSR), కిరణ్ కుమార్ రెడ్డి (Kiran Kumar Reddy) మంత్రి వర్గంలో ప్రాథమిక విద్యా శాఖ మంత్రిగా పని చేశారు. గత కొన్నాళ్లుగా వైసీపీ (YCP)తో ఆయనకు సంబంధాలు పెరుగుతుండటంతో చివరకు అధికార పార్టీలో చేరాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ చేరిక వైసీపీకి మరింత బలం చేకూర్చనుందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ (Rayalaseema) రాజకీయాల్లో శైలజానాథ్‌కు ఉన్న అనుభవం, ఆయన అనుచర బలం వైసీపీని మరింత పటిష్టం చేయనున్నారు.






