వారిపై చర్యలు తీసుకోండి: డీజీపీకి YSRCP లేఖ

by Vemula.Srinu Prasad |

తిరుమల లడ్డూ కల్తీపై విమర్శిస్తూ టీడీపీ నేతలు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై డీజీపీకి వైసీపీ ఫిర్యాదు చేసింది...

వారిపై చర్యలు తీసుకోండి: డీజీపీకి YSRCP లేఖ
X

దిశ, వెబ్ డెస్క్: ‘‘మహాపాపం నిజం...68.17 లక్షల కల్తీ నెయ్యి.. అది నెయ్యే కాదు.’’ అంటూ వైసీపీ(Ycp) నేతలను ఉద్దేశించి రాష్ట్రంలో పలుచోట్ల ఫెక్సీలు వెలసిన విషయం తెలిసిందే. అయితే ఈ ఫ్లెక్సీలను టీడీపీ(Tdp) నేతలే ఏర్పాటు చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపించారు. అంతేకాదు టీడీపీ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు ప్రచారం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా (DGP Harish Kumar Gupta)కి లేఖ ద్వారా ఫిర్యాదు చేశారు. తప్పుడు ప్రచారం చేస్తూ ఫ్లెక్సీలు పెట్టిన వారిపై చర్య తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. అలాంటి ఫ్లెక్సీలపై నిషేధాజ్ఞలు జారీ చేయాలంటూ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి(MLC Lella Appi Reddy) లేఖ రాశారు.

ఛార్జ్‌షీట్‌‌నూ తప్పుదోవ

‘‘తిరుమల లడ్డూని అవమానించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. తమ పార్టీ నేతలకు ఆపాదిస్తూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఫ్లెక్సీలు పెట్టిన వారిపై కఠిన చర్యలు తీసుకోండి. సీబీఐ సిట్‌ ఛార్జ్‌షీట్‌‌ను కూడా తప్పుదోవ పట్టిస్తున్నారు. గుంటూరు, పిడుగురాళ్ల, వినుకొండ, దర్శితో పాటు, రాష్ట్రంలో చాలాచోట్ల ఇలాంటి వివాదాస్పద ఫ్లెక్సీలు పెట్టారు. మా పార్టీకి వ్యతిరేకంగా తప్పుడు ప్రచారం చేయడంతో పాటు పార్టీ నేతల పరువుకు భంగం కలిగించేలా ఫోటోలు కూడా వేశారు. రాష్ట్రంలో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలిగించేలా వ్యవహరిస్తున్నారు.’’ అని లేఖలో ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి తెలిపారు.

Next Story